టికెటింగ్ పోర్టల్ లో సంక్రాంతి జోరు మామూలుగా లేదే!
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, మేకింగ్ వీడియో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతి వస్తున్నాం' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూడవ చిత్రం ఇది. అనీల్ సోలో హీరోగా వెంకీని ఎలా ఆవిష్కరించాడు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, మేకింగ్ వీడియో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించారు. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజునే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న చిత్రాలు. అలాం టి వెంకీకి అనీల్ తోడవ్వ డంతో ఈసారి అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. వెంకీ...అనీల్ మార్క్ చిత్రమని ప్రూవ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకి క్రేజ్ ఎలా ఉందన్నది మరోసారి ప్రూవ్ అయింది. బుక్ మై షో టికెటింగ్ పోర్టల్ లో లక్షకు పైగా ఆసక్తిని చూపించారు. ఐయామ్ ఇంట్రెస్టెడ్ అంటూ ప్రేక్షకులు సినిమాపై తమ ఆసక్తిని వెల్లడించారు.
దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకా భిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు స్ఫష్టమైంది. సంక్రాంతి సీజన్ రిలీజ్ లో ఈ సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సేఫ్ జోన్ చిత్రం గానూ సంక్రాంతికి వస్తున్నాం పేరు సినీ మార్కెట్ లో బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాలోని 'గోదారి గట్టు' అనే చార్ట్‌బస్టర్ పాటతో మ్యూజికల్ ప్రమోషన్‌లు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఒక్కో లిరికల్ శ్రోతల్ని అలరించింది.
తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తోన్న విషయం స్పష్టమైంది. గంటల వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ - మీనాక్షి చౌదరి కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వేరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదే సీజన్ కు ఆయన నిర్మిస్తోన్న మరో చిత్రం గేమ్ ఛేంజర్ కూడా జనవరి 10న రిలీజ్ అవుతుంది. ఈ రెండు రిలీజ్ లకు నాలుగు రోజులు గ్యాప్ ఉంది.