ఇట్స్ అఫీషియల్.. వెంకీ కూడా సంక్రాంతికే..
వెంకీ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. 2024 సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ అవ్వగా... డిజాస్టర్ టాక్ అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా అంతగా రాణించలేదు. ఇప్పుడు తన కొత్త మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్సయ్యారు. వెంకీ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు అవన్నీ నిజంగా మారాయి. ఉగాది పండుగ సందర్భంగా వెంకటేష్- అనిల్ రావిపూడి ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అనిల్ రావిపూడితో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు చేసిన వెంకీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి ఆయనతో చేతులు కలిపారు. వెంకీ మామ- అనిల్ కాంబో అంటే అందరికీ నవ్వులు గుర్తొస్తాయి. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో ఆడియన్స్ను అంతలా నవ్వించారు.
ఇప్పుడు ఈ సినిమాను మల్టీస్టారర్ గా కాకుండా.. మల్టీ హీరోయిన్ పిక్చర్ గా తీసుకురాబోతున్నారు అనిల్ రావిపూడి. మాజీ ప్రియురాలు, అద్భుతమైన భార్య మధ్య నలిగిపోయే ఓ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ కనిపించబోతున్న ట్లు వీడియో ద్వారా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా మంచి కామెడీ అండ్ ట్రయాంగిల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.
అనిల్- వెంకీ కాంబోలో ఇప్పటికే వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజే.. ఈ సినిమాను కూడా నిర్మించనున్నారు. వీరి ముగ్గురి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. కొత్త మూవీ పై అప్పుడే మంచి అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజుతో ఈ చిత్రం కోసం ఆరోసారి వర్క్ చేయనున్నారు అనిల్ రావిపూడి. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు.
ఇక ఈ సినిమా భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. ఇంకా మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం గమనార్హం. ఇప్పటికే సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. విశ్వంభర చిత్రంతో ఆయన రానున్నారు. మరి చూడాలి 2025 సంక్రాంతి పోటీ ఎలా ఉంటుందో.