మహేష్ - చరణ్.. ఇప్పుడు నితిన్!
వాటిలో వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ ఒకటి కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు ఇంకో మూవీ
ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు నితిన్ గత ఏడాది ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో నితిన్ ఉన్నాడు. అందుకే ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు.
వాటిలో వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ ఒకటి కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు ఇంకో మూవీ. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఇప్పుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న తమ్ముడు సినిమా కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా లైన్ తోనే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి.
అక్క జీవితాల్లో ఎదురయ్యే ఛాలెంజ్ లని తమ్ముడు ముందుండి ఎలా పరిష్కరించాడు అనేది ఈ మూవీ కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు అర్జున్ సినిమాని అక్క సెంటిమెంట్ తో చేశాడు. అయితే అది అతనికి కలిసిరాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ కూడా ట్రై చేశాడు. అతనికి వర్క్ అవుట్ కాలేదు. ఇష్క్ లో అసలు కథకు కాస్త అక్క సెంటిమెంట్ ఉంటుంది. కానీ అందులో మేజర్ లవ్ స్టొరీ క్లిక్కయ్యింది.
ఇప్పుడు తమ్ముడు కథలో మాత్రం వేణు శ్రీరామ్ ఎక్కువ భాగం అక్క సెంటిమెంట్ ను హైలెట్ చేస్తున్నట్లు టాక్. వేణు నానితో చేసిన ఎంసిఏ పరవాలేదు అనిపించింది. అందులో వదిన సెంటిమెంట్ తో స్టోరీ లైన్ ఉంటుంది. ఇక ఆ తరువాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ వేణు శ్రీరామ్ చేశారు. ఆ మూవీ తర్వాత మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే తమ్ముడు మూవీని స్టార్ట్ చేశారు.
గత ఏడాది ఆగష్టులో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఇప్పటికే మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ లయ ఈ మూవీతో మరల టాలీవుడ్ లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ అక్కగా ఆమె సినిమాలో కనిపించబోతోంది. కన్నడ బ్యూటీ సప్తమి గౌడ నితిన్ కి జోడీగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో అంటే కచ్చితంగా కథలో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. చూడాలి మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.