వేణు స్వామి.. నాగ చైతన్య కుటుంబంకి సారీ చెబితే సర్ధుకుంటుందా..?
ఒక మనిషి తన జీవితంలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాడు.
ఒక మనిషి తన జీవితంలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తాడు. దాన్ని నమ్మేలా చెప్పే వారి మాటలను గుడ్డిగా నమ్ముతాడు. మనిషి ఆశా జీవి కాబట్టి ఏదో చేస్తే ఏదో అద్భుతం జరుగుతుందని వారు చెప్పినట్టు చేసి వారిని పెంచి పోశిస్తుంటారు. ఇలాంటివి ఒకరిద్దరు కాదు దేశం లో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఐతే మన దగ్గర సెలబ్రిటీస్ కి జాతకాలు చెబుతూ వారికి ఉన్న దోషాలు పోగొట్టేలా పూజలు హోమాలు చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నాడని వేణు స్వామి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఆయన ఇన్నాళ్లు చేసిన సెలబ్రిటీ బ్లాక్ మెయిలింగ్, దొంగ పూజలు అన్ని ఒక్కొక్కటిగా ఆరోపణలు బయటకు వస్తున్నాయి.
రీసెంట్ గా వేణు స్వామి నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే వాళ్లిద్దరు కూడా 3 ఏళ్లలో విడిపోతారని జాతకం చెప్పాడు. అక్కడ మొదలైన రచ్చ కొనసాగుతూనే ఉంది. గతంలో ఏపీలో వైసీపీ, తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారి సపోర్ట్ తో వేణు స్వామి ఏం చెప్పినా అలా నడిచిపోయేది. కానీ ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీలో కూటమి అధికారంలో ఉండటం వల్ల వేణు స్వామి ఆటలు సాగడం లేదు.
తన దగ్గరకు వచ్చిన వారిని ఏదో ఒకటి చెప్పి భయపెట్టి బిజినెస్ చేసే వాడని ఈమధ్య చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఐతే ఏపీలో తాను చెప్పినట్టుగా రిజల్ట్ రాకపోవడంతో తనకు తానుగానే ఇక మీదట ఎలాంటి ప్రిడిక్షన్, జాతకాలు చెప్పనని చెప్పిన వేణు స్వామి నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే వారిద్దరు విడిపోతారని జాతకం చెప్పాడు. శుభమా అని వారు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఎవరైనా శుభాకాంక్షలు అందిస్తూ ఆశీర్వాదాలు చెబుతారు. కానీ వేణు స్వామి మాత్రం అందరి కన్నా భిన్నంగా వారు ఎప్పుడు విడిపోతారో చెబుతాడు ఆల్రెడీ నాగ చైతన్య సమంత డైవర్స్ ఇష్యూ మీదే వేణు స్వామి మీద అందరు ఫైర్ మీద ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత జాతకం చెప్పడంతో సోషల్ మీడియాలో కూడా వేణు స్వామి మీద ఎటాక్ చేశారు.
ఐతే మ్యాటర్ మరీ సీరియస్ అవుతుందని వేణు స్వామి తెలివిగా అతని వైఫ్ శ్రీవాణిని రిపేరింగ్ కి దించాడు.. కానీ చూస్తే ఆమె టాపిక్ అంతా డైవర్ట్ చేసి మరింత రిస్క్ లో పడేసింది. ఐతే చివరగా వీరిద్దరు కలిసి మరణ వాంగ్మూలం అంటూ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. జర్నలిస్ట్ మూర్తి తమని 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఒక ఫేక్ ఆడియో కాల్ తో వచ్చారు. కానీ అది వీరిని మరింత కష్టాల్లోకి పడేలా చేసింది. మూర్తితో పాటు ఫిల్మ్ జర్నలిస్టులు కూడా వేణు స్వామి అతని భార్య శ్రీ వాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐతే అసలు మ్యాటర్ ఇది కాదు.. నాగ చైతన్య శోభిత జాతకం చెప్పినందుకు గొడవ మొదలైంది కాబట్టి ఆ రెండు కుటుంబాలకు సారీ చెప్పి ఇక మీద ఇలాంటివి చేయనని చెబితే సరిపోయేది.. అలా కాకుండా దీన్ని డైవర్ట్ చేస్తూ మూర్తి 5 కోట్లు అడిగాడు.. అందులో సినీ జర్నలిస్టులు ఉన్నారంటూ హడావిడి చేశారు. దీని వల్ల వారికి సానుభూతి వస్తుందని అనుకోగా రివర్స్ లో అందరు వారి మీదే రకరకాల విమర్శలు చేస్తున్నారు.
వేణు స్వామి మీద మూర్తి ఇప్పటికే పోలీసు కేస్ ఫైల్ చేయగా ఆ ఫేక్ కాల్ ఎవరు చేశారు.. దానిలో పాత్రదారులు ఎవరు.. దాని వెనక ఉంది ఎవరు. వీటిపై విచారణ కోరుతున్నారు. అన్నిటికీ వేణు స్వామి మీదే వేళ్లు చూపిస్తున్నాయి. మరి ఈ విషయం లో వేణు స్వామి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి.