సూపర్ స్టార్ మూవీ.. క్లాప్ కి ముహూర్తం ఫిక్స్
ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయన్ సినిమాను చేస్తున్నాడు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున దేవర సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
వెట్టయన్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే రజినీకాంత్ తన తదుపరి సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. విక్రమ్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ లియో తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
అందుకే కాస్త గ్యాప్ తీసుకుని, మరింత శ్రద్ద పెట్టి రజినీకాంత్ తో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రజినీకాంత్ మరియు లోకేష్ కనగరాజ్ ల కాంబో మూవీ ని సెట్స్ పైకి జూన్ 10న సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.
లియో సినిమా విషయంలో జరిగిన తప్పును లోకేష్ కనగరాజ్ పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రజినీకాంత్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో ఉండబోతున్నాడట.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ఖైదీ సినిమా కు సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నాడు. రజినీ కాంత్ ను గ్రే షేడ్ లో చూపించేందుకు గాను లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.