సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా ప్రమోషన్ తీసుకున్న హిమేష్ రేషమియా.. చెప్పుకోదగ్గ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇంతకుముందు ఆప్ కా సరూర్ - కర్జ్ - రేడియో - కజరారే వంటి సినిమాలతో అలరించిన హిమేష్.. ప్రస్తుతం తేరాసరూర్-2ని విడుదలకు సిద్ధం చేశాడు. హిమేష్ రేషమియా స్వయంగా మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీ.. మార్చ్ 11న విడుదల కానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ హీరో చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
'తన లవర్ ని డ్రగ్స్ కి సంబంధించిన కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన శతృవులపై హీరో చేసిన పోరాటమే తేరా సరూర్-2. ఈ మూవీలో సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా పాత్ర పేరు రఘు' అని చెప్పిన హిమేష్.. అక్కడితో ఆగలేదు. ఈయనకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లాగా యాంగ్రీమెన్ అనే పేరు సంపాదించలని ఉందట. అంతే కాదు.. కమల్ హాసన్ లాగా విభిన్న పాత్రల్లో కనిపించాలనే కోరకని కూడా బయటపెట్టాడు. అయితే, తనను ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్లోనే చూడ్డానికి ఇష్టపడ్డంతోనే.. వీటిని చేస్తున్నట్లు చెప్పాడు ఈ హీరో.
హిమేష్ చెప్పిన సంగతులు బాగానే ఉన్నాయ్ కానీ.. ఏకంగా ఒకేసారి కమల్ హాసన్ స్థాయిలో యాక్టింగ్ చేయాలనే కోరిక మాత్రం టూమచ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇతగాడు హీరోగా చేసిన సినిమాలు.. ఆ మాత్రం ఆడుతున్నాయంటే అదంతా ఆల్బమ్స్ తెచ్చిపెట్టిన క్రేజ్. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. అమితాబ్, కమల్ అంటూ కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదని విమర్శలొస్తున్నాయి. అయినా పోల్చుకోవడానికి కూడా ఓ రేంజ్ ఉండాలి కదా.