జీవతకథల వెల్లువలో రోజుకో బయోపిక్ అప్ డేట్ వేడి పెంచుతోంది. ఓవైపు టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ - లక్ష్మీస్ ఎన్టీఆర్ - వైయస్సార్ బయోపిక్ అంటూ ఒకటే రగడ నడుస్తోంది. వీటికి తోడు సైనా - సానియా - పుల్లెల గోపిచంద్ బయోపిక్ లు అంటూ మోతెక్కిపోతోంది. పలువురు హిస్టారియన్స్ కథల్ని వెలికి తీసి సినిమాలు తీస్తున్నారు.
మరోవైపు పొరుగు పరిశ్రమ కోలీవుడ్ లోనూ సేమ్ సీన్. అక్కడా బయోపిక్ ల అగ్గి రాజుకుంది. రోజురోజుకు దహించేస్తోంది. అందులో ముఖ్యంగా అమ్మ జయలలిత బయోపిక్ తెరకెక్కించేందుకు పోటాపాటీ పరిస్థితి నెలకొంది. దివంగత కథానాయిక - మహా నాయకురాలు - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథలో బోలెడన్ని ట్విస్టులు - టర్నులు ఉండడంతో తెరపై ఆద్యంతం రక్తి కట్టించేందుకు ఆస్కారం ఉందని భావించిన పలువురు ఫిలింమేకర్స్ జయలలిత బయోపిక్ లను తామర తంపరగా ప్రకటించేశారు. వీళ్లలో ఓ నలుగురు మాత్రం అస్సలు తగ్గేట్టు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఒకేసారి ముగ్గురు నలుగురు కథానాయికలకు జయలలిత పాత్రలో నటించే అవకాశం లభించనుందని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే అమ్మ పాత్రకు క్యూట్ త్రిష పేరు పరిశీలనలో ఉందన్న ప్రచారం సాగింది. అమ్మ బతికున్నప్పుడు త్రిషను ఎంతగానో అభిమానించేది. త్రిష కూడా అమ్మకు డివోటీ. అందువల్ల ఆ ఛాన్స్ తననే వరించేందుకు ఆస్కారం ఎక్కువ అని తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన ఓ నిర్మాణ సంస్థ - అలానే చెన్నయ్ కి చెందిన వేరొక నిర్మాణ సంస్థ ఇప్పటికే జయలలిత బయోపిక్ ల కోసం పేర్లను సీరియస్ గా పరిశీలిస్తున్నాయట. ఇందులో త్రిష పేరుతో పాటు - రింగుల జుత్తు సోయగం నిత్యామీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిత్యా గత కొంతకాలంగా ఎందుకనో కెరీర్ కి బ్రేక్ నిచ్చింది. ఇప్పుడు జయలలిత పాత్రలో అవకాశం అందుకునే ఛాన్సుందన్న వార్తతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. మరోవైపు తలైవి నయనతార పేరు రేస్ లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే నయన్ కి అమ్మ బయోపిక్ ని ఆఫర్ చేసిందన్న ప్రచారం కోలీవుడ్ లో సాగుతోంది. మరోవైపు `ఎన్టీఆర్` బయోపిక్ లో అత్యంత కీలకమైన బసవతారకం (అన్నగారి సతీమణి) పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్ తదుపరి జయలలిత పాత్రలో నటిస్తారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఏ ప్రొడక్షన్ హౌస్ ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేసుకున్నాయి? అన్నదానిపై అస్పష్టత నెలకొంది. మరింత క్లారిటీ రావాలంటే కాస్త వేచి చూడాల్సిందే. 2019 ఫిబ్రవరిలో అమ్మ జయలలిత తొలి జయంతి రోజున ఈ ప్రకటనలన్నీ వెలువడనున్నాయని, అంతకుముందే క్లారిటీ వచ్చే ఛాన్సుందని తెలుస్తోంది.