ఆ హీరోతో నయన్‌ ముద్దు... విఘ్నేష్ తో గొడవ!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ తమ రిలేషన్ గురించి, తమ ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Update: 2024-08-07 03:15 GMT

లేడీ సూపర్ స్టార్‌ నయనతార పెళ్లి, ఇద్దరు పిల్లల తర్వాత కూడా హీరోయిన్‌ గా బిజీగా ఉంది. కెరీర్ ఆరంభంలో ప్రేమ వ్యవహారాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్న నయనతార విఘ్నేష్ శివన్‌ తో ప్రేమలో పడ్డ సమయంలో కూడా చాలా మంది మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగా విమర్శించారు. కానీ ఏడు సంవత్సరాల పాటు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ వ్యవహారం సాగించింది. ఆ సమయంలో ఇద్దరూ సహజీవనం లో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. కలిసి విదేశాలకు వెళ్లడం తో పాటు అన్ని చోట్ల కలిసే కనిపించే వారు.

నానున్‌ రౌడీ థాన్ సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ వ్యవహారం చిగురించింది. మొదట్లో ఇద్దరి మధ్య వయసు గురించి టాక్ నడిచింది. ఆ తర్వాత విఘ్నేష్ తో నయన్‌ ఎక్కువ కాలం రిలేషన్‌ లో ఉండటం సాధ్యం కాదని కొందరు అన్నారు. కానీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారు. పెళ్లి అయ్యి రెండేళ్లు అయింది. ఇప్పటికి కూడా చాలా సంతోషంగా వారి జీవితం సాగుతుందట.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ తమ రిలేషన్ గురించి, తమ ఫ్యామిలీ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి బేషజాలు ఉండవు. ప్రతి విషయంలో కూడా ఒకరిని ఒకరు సమర్ధించుకుంటూ ఉంటాం. ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవించుకోవడం వల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు. కనుక మా వైవాహిక బంధం చాలా సంతోషంగా సాగుతుందని విఘ్నేష్ చెప్పుకొచ్చాడు. ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో భార్య భర్తలు గా ఉండమని అన్నాడు.

సెట్స్ లో నయన్‌ కేవలం హీరోయిన్‌ గా మాత్రమే బిహేవ్ చేస్తుంది. ఒక సన్నివేశం బెస్ట్‌ గా రావడంకు ఎంతటి కష్టంకు అయినా సిద్దం అంటుంది. ఆ కష్టపడే తత్వం వల్లే నయన్‌ లేడీ సూపర్ స్టార్‌ అయ్యింది. అయితే కొన్ని సార్లు రొమాంటిక్ సన్నివేశాల షూటింగ్ సమయంలో మాత్రం ఇబ్బంది పడుతుంది. మా ఇద్దరి మధ్య ఒక ముద్దు సన్నివేశం కారణంగా గొడవ అయ్యింది. ఆ సమయంలో అందరి ముందే నన్ను ఆమె నన్ను తిట్టేసి అక్కడ నుంచి వెళ్లి పోయిందని నానున్‌ రౌడీ థాన్ షూటింగ్‌ విషయాలను గుర్తు చేసుకున్నాడు.

నానున్‌ రౌడీ థాన్‌ లో విజయ్‌ సేతుపతి, నయన్‌ ల మధ్య ఒక ముద్దు సన్నివేశం ఉంటుంది. ఆ ముద్దు సన్నివేశం షూట్ సమయంలో నేను ఆమెను కాస్త ఎక్కువగానే విసిగించాను. పలు సార్లు రీ షూట్‌ కి వెళ్దాం అన్నాను. ముద్దు సన్నివేశం ని ఇంకాస్త క్లోజ్ గా చేయమని, ఇంకా క్లోజ్ గా విజయ్ సర్‌ కి దగ్గరగా ఉండమని నయన్‌ కు నేను చెప్పాను. ఆ సమయంలో ఆమె లో అసహనం కనిపించింది. నన్ను సైకో అంటూ అందరి ముందు తిట్టి వెళ్లి పోయింది. ఆ తర్వాత మళ్లీ వచ్చి షాట్‌ ను కంప్లీట్‌ చేసిందని విఘ్నేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News