రెండేళ్ల తర్వాత RRR భీమ్ గురించి విజయేంద్ర ప్రసాద్ అలా..!

ఇద్దరికి సమానమైన పాత్ర ఇచ్చి ఇద్దరిని సూపర్ గా హ్యాండిల్ చేశాడు రాజమౌళి.

Update: 2024-01-23 15:29 GMT

2022 లో వచ్చిన RRR సినిమా సంచలన విజయం అందుకుంది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాగా ఈ సినిమా మరోసారి రాజమౌళి స్టామినాని చూపించింది. అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్ ఒక్కడే హీరో విలన్ గా రానాని కావాలనే తీసుకున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు నటించారు. ఇద్దరికి సమానమైన పాత్ర ఇచ్చి ఇద్దరిని సూపర్ గా హ్యాండిల్ చేశాడు రాజమౌళి.

RRR గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ కాగా ఎక్కడో ఒకచోట సినిమాలో హీరో పాత్రల మీద కొందరు కావాలని చర్చలకు దారి తీశారు. ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్ర చాలా తక్కువ ఉందని. రాం చరణ్ తో పోల్చితే తారక్ పాత్ర స్క్రీన్ స్పేస్ కానీ ఎలివేషన్ కానీ తగ్గించారని అన్నారు. ఫ్యాన్స్ మధ్య కాకపోయినా కొందరు నెటిజెన్లు ఈ విషయంపై చాలా సీరియస్ డిస్కషన్స్ నడిపించారు. అయితే ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో రామరాజు, భీమ్ పాత్రలకు సమానమైన ప్రియారిటీ ఇస్తూ సీన్స్ రాశామని. కాకపోతే నార్త్ సైడ్ రామ రాజు పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అక్కడ రామరాజు పాత్ర కాషాయ దుస్తులు వేసుకోగానే అతన్ని రాముడు అనుకున్నారు. అలా రాం చరణ్ పాత్ర అక్కడ హైలెట్ అయ్యింది. అయితే ఎన్.టి.ఆర్ పాత్ర చేయడం చాలా కష్టమని అన్నారు విజయేంద్ర ప్రసాద్. రామ రాజు పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కానీ ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్ర అమయాకమైనది. అలాంటి పాత్ర చేయడం చాలా కష్టమని అన్నారు.

సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా సమానంగా అనిపించాయి. అయితే నార్త్ సైడ్ రామరాజు పాత్రని రాముడిగా అనుకోవడం వల్ల అక్కడ రాం చరణ్ పాత్రకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. సో మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ కూడా చరణ్, తారక్ ల పాత్రల్లో ఎలాంటి తేడా లేదా ఇద్దరు సినిమాకు ఈక్వల్ ఇంపార్టెన్స్ అని క్లారిటీ ఇచ్చారు.

RRR విషయంలో చరణ్, ఎన్.టి.ఆర్ పాత్రల గురించి అప్పట్లో మీడియాలో కూడా విపరీతమైన డిస్కషన్స్ నడిచాయి. రాజమౌళి మాత్రం వాటి గురించి ఏమి పట్టించుకోకుండా సినిమాను చేశారు. అవుట్ పుట్ పై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సంతృప్తి చెందారు. అయితే కొందరు కావాలని ఒకరి పాత్ర ఎక్కువ మరొకరి పాత్ర తక్కువ అని చెప్పుకున్నారు. కానీ అవేవి సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపలేదు.

Tags:    

Similar News