హాలీవుడ్ స్టూడియోలో విజయ్ ఫ్యామిలీ.. లవ్లీ మూమెంట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-01 15:16 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ షూటింగ్ నుంచి కొంత విరామం దొరకడంతో విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళాడు.

విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వారి తండ్రి గోవిందరావు, తల్లి మాధవితో కలిసి యూఎస్ లోని యూనివర్సల్ స్టూడియోస్ చూడటానికి వెళ్ళారు. హాలీవుడ్ కి చెందిన యూనివర్సల్ స్టూడియోస్ లో అద్భుతమైన లోకేషన్స్ ఉన్నాయి. ఈ లోకేషన్స్ అన్నింట్లో ఫ్యామిలీతో కలిసి విజయ్ దేవరకొండ సందడిగా గడిపారు. ఖరీదైన లగ్జరీ షిప్స్ లో విహరించడంతో పాటు అద్భుతమైన ద్వీపాన్ని సందర్శించారు.

ఈ విహారయాత్రలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో VD14, రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 సినిమాని చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందంట.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ VD12 మూవీ 2025 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేదు. ఓ విధంగా చెప్పాలంటే టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు.

ఖుషి మూవీ కొంత పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ది ఫ్యామిలీ స్టార్ అయితే పూర్తిగా డిజాస్టర్ అయ్యింది. దీంతో హోప్స్ అన్ని కూడా VD!2 పైన ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మూవీలో విజయ్ దేవరకొండ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News