సంక్రాంతికి VD 12 సర్ ప్రైజ్..!

ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్ కి హై వస్తుంది. ఐతే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Update: 2025-01-10 04:56 GMT

సంక్రాంతికి కొత్త సినిమాల సందడి మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తాయి. పొంగల్ కి ఓ పక్క సినిమాల సందడితో పాటు రాబోతున్న సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి పండగ జోష్ డబుల్ చేయనున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ రాబోతున్న క్రేజీ సినిమాల నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ దేవరకొండ, గౌతం తిన్ననూరి కలిసి చేస్తున్న సినిమాపై భారీ హైప్ ఏర్పడింది.

ఈ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్ కి హై వస్తుంది. ఐతే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ తో నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా ఈ టీజర్ తో జోష్ పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. నిర్మాత చెప్పడం అయితే సినిమా ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నాడు.

జెర్సీతో తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన గౌతం ఈసారి విజయ్ తో మరో అద్భుతమైన కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ మాస్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని అంతేకాదు సినిమా రెండు భాగాలుగా వస్తుందని నిర్మాత చెప్పాడు. సో అంచనాలన్నీ ఈ రేంజ్ లో ఉంటే వాటికి తగినట్టుగానే టీజర్ ఉండాలి.

విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ నటిస్తున్న ఈ సినిమా మీద దర్శక నిర్మాతల కాన్ఫిడెన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. విజయ్ దేవరకొండ కూడా ఒక సూపర్ హిట్ కోసం ఆతృతగా ఉన్నాడు. సో హిట్టు పడింది అంటే మాత్రం విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ దెబ్బ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. VD12 సినిమా టీజర్ తో పొంగల్ ని మరింత కలర్ ఫుల్ చేయనున్నారు. మరి నిజంగానే సినిమా నుంచి టీజర్ వస్తుందా లేదా అన్నది మేకర్స్ స్పందించాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విజయ్ రవికిరణ్, రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే.

Tags:    

Similar News