కింగ్ డమ్ తర్వాత.. కథ వేరే లెవెల్ అట..!
ఇక ఇదిలా ఉంటే కింగ్ డమ్ సినిమా తర్వాత సినిమాలు కూడా విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది.
యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ ని అలరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ సినిమా ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ విజయ్ దేవరకొండ ఇక మీదట పరుగెత్తాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎంత పెద్ద స్కెచ్ లో ఉన్నారన్నది రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
ఇన్నాళ్లకు విజయ్ దేవరకొండ స్టామినాకు తగిన సినిమా పడిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కింగ్ డమ్ సినిమా చాలా పెద్ద కథగానే ఉండబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కింగ్ డమ్ సినిమా తర్వాత సినిమాలు కూడా విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. కింగ్ డమ్ తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కాస్టింగ్ ని కొత్త వాళ్లని ఎంపిక చేసేలా ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా కూడా తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో విలేజ్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది. ఇది కూడా పక్కా మాస్ సినిమాగా వస్తుందని టాక్. ఇక ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ సినిమా రాబోతుంది. విజయ్ తో ఆల్రెడీ టాక్సీవాలా తీసి సక్సెస్ అందుకున్న రాహుల్ ఈసారి ఒక పీరియాడికల్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది.
సో కింగ్ డమ్ తో మొదలవుతున్న విజయ్ మాస్ విధ్వంసం రాబోయే సినిమాలన్నిటికీ కొనసాగించేలా ఉన్నాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమాల మీద ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమా నిర్మిస్తున్న ప్రొడక్షన్స్ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ పెంచేలా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ ఏం చేస్తాడన్నది చూడాలి. కింగ్ డమ్ లో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది. రవికిరణ్ ఇంకా రాహుల్ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది.