GOAT బాక్సాఫీస్.. పరిస్థితి ఎలా ఉందంటే..
మూవీ తమిళంలో 39.15 కోట్ల షేర్ అందుకుంది. తెలుగులో 3 కోట్ల వరకు షేర్ లభించిందంట. హిందీలో 1.85 కోట్ల షేర్ వచ్చింది. ఓవరాల్ గా 44 కోట్ల షేర్ మొదటి రోజు ఈ చిత్రం అందుకుంది.
ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన The GOAT మూవీకి థియేటర్స్ మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా నటించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రానికి సినిమా క్రిటిక్స్ నుంచి కూడా మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అలాగే పబ్లిక్ నుంచి కూడా అంతంత మాత్రంగానే స్పందన ఉంది. అయితే దళపతి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి.
వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ఈ చిత్రానికి 126 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ లభించినట్లు తెలుస్తోంది. దళపతి కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రాలలో GOAT మూవీ ఒకటిగా నిలిచింది. మూవీ తమిళంలో 39.15 కోట్ల షేర్ అందుకుంది. తెలుగులో 3 కోట్ల వరకు షేర్ లభించిందంట. హిందీలో 1.85 కోట్ల షేర్ వచ్చింది. ఓవరాల్ గా 44 కోట్ల షేర్ మొదటి రోజు ఈ చిత్రం అందుకుంది. అయితే రెండో రోజుకి ఈ సినిమాకి పబ్లిక్ రెస్పాన్స్ పూర్తిగా మారిపోయింది.
మొదటి రోజుతో పోల్చుకుంటే ప్రేక్షకుల స్పందన సగానికి పైగా తగ్గిపోయింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు తమిళ్ మార్కెట్ లోనే ఆక్యుపెన్సీ 50.57% తగ్గిపోయిందంట. అలాగే కలెక్షన్స్ కూడా 13.89 కోట్లకి పడిపోయాయి. ఈ కలెక్షన్స్ బట్టి సినిమాకి ఎలాంటి స్పందన వచ్చిందో చెప్పొచ్చు. ఇక తెలుగు, హిందీ రాష్ట్రాలలో అయితే ఇంకా దారుణంగా ఆక్యుపెన్సీ పడిపోయింది. మొదటి రోజు ఈ చిత్రానికి చెన్నైలో అత్యధికంగా 82% థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉంటే ముంబైలో అత్యల్పంగా 16.5% మాత్రమే ఆక్యుపెన్సీ నమోదు అయ్యిందంట.
రెండో రోజుకే ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఇక కోలుకోవడం కష్టం అనే మాట వినిపిస్తోంది. అయితే శని, ఆదివారాలు వీకెండ్స్ కాబట్టి కొంత అనుకూలత ఉండొచ్చేమో అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ 250 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. విజయ్ రెమ్యునరేషన్ లో సగం కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వస్తాయా అనేది సందేహమే.
దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని వెంకట్ ప్రభు ప్రకటించాడు. GOAT Vs OG అనే టైటిల్ ని ఖరారు చేశారు. చివర్లో శివకార్తికేయన్ ని పోలీస్ ఆఫీసర్ గా రివీల్ చేశారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చి కలెక్షన్స్ గణనీయంగా డ్రాప్ కావడంతో లాంగ్ రన్ లో కమర్షియల్ డిజాస్టర్ గా ఈ చిత్రం మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ఈ సీక్వెల్ తెరకెక్కకపోవచ్చు అని భావిస్తున్నారు.