విజయ్ చివరి సినిమా.. ఆ హీరో రిజెక్ట్ చేసిన కథతోనే..?

ఇళయదళపతి విజయ్ రీసెంట్ గా GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

Update: 2024-09-15 04:58 GMT

ఇళయదళపతి విజయ్ రీసెంట్ గా GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ తో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 400 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్న కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే అందుకోలేదు. ఇదిలా ఉంటే విజయ్ హీరోగా తన చివరి చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయాలలోకి అడుగుపెట్టిన విజయ్ 69వ సినిమా తన లాస్ట్ మూవీ అని కన్ఫర్మ్ చేసేసారు.

హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రీసెంట్ గా మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ఎనౌన్స్ చేశారు. ఇందులో టార్చ్ బేరర్ ని హైలైట్ చేశారు. దానిపై టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని మెన్షన్ చేశారు. ‘దళపతి69’ వర్కింగ్ టైటిల్ తో ఈ పోస్టర్ వదిలారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయించనున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దళపతి 69 సినిమా కోసం విజయ్ ఏకంగా 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. ఈ సినిమా గురించి ఇంకో ఇంటరెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది.

గతంలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది హోల్డ్ లో పడింది. తరువాత కమల్ హాసన్ ఎందుకనో ఈ చిత్రాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కథతో హెచ్ వినోద్ దళపతి విజయ్ 69 సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ కి సరిపోయే విధంగా వినోద్ కథలు మార్పులు చేసి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడంట.

ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో వినోద్ ఉన్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ పై అప్డేట్ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. సీనియర్ యాక్టర్ సిమ్రాన్ పేరు ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా వినిపిస్తోంది. అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. త్వరలో మూవీకి సంబందించిన కంప్లీట్ అప్డేట్స్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News