నీతో పాటు నేనూ చనిపోయాను.. విజయ్ ఆంటోని ఎమోషనల్
ఇప్పుడు తన కోసమే జీవిస్తున్నాను. నేను ఇప్పుడు చేయబోయే మంచి పనులన్నీ నా కుమార్తె పేరు మీద చేస్తాను.. మీ విజయ్ ఆంటోనీ" అంటూ బాధాతృప్త హృదయంతో లేఖను రాసారు.
తమిళ నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా చెన్నై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా నివేదికల ప్రకారం మీరా డిప్రెషన్‌తో పోరాడుతోంది. కుమార్తె మరణంతో విజయ్ ఆంటోని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కుమార్తెను కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ మూడు రోజుల తర్వాత ఒక ప్రకటన విడుదల చేశాడు. గురువారం విజయ్ ఆంటోనీ తన ట్విట్టర్‌లో తన కుమార్తె మృతికి సంతాపం తెలిపారు. నటుడు ఎమోషనల్ నోట్‌ను రాశాడు. "నా కుమార్తె మీరా చాలా ప్రేమగల అమ్మాయి.. ధైర్యమైన అమ్మాయి.. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం నిండి ఉన్న ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఇప్పుడు వెళ్ళింది. తను నాతో మాట్లాడుతోంది. నేను కూడా తనతో పాటే చనిపోయాను. ఇప్పుడు తన కోసమే జీవిస్తున్నాను. నేను ఇప్పుడు చేయబోయే మంచి పనులన్నీ నా కుమార్తె పేరు మీద చేస్తాను.. మీ విజయ్ ఆంటోనీ" అంటూ బాధాతృప్త హృదయంతో లేఖను రాసారు.
మీరా మృతి పట్ల నెటిజన్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీని ఓదార్చే ప్రయత్నం చేసారు. సార్ వ్యక్తీకరించడానికి పదాలు విజల్లేవు. దేవుడు మీకు పూర్తి శక్తిని ప్రసాదిస్తాడని ఆశిస్తున్నాను. అని ఒకరు వ్యాఖ్యానించారు. సార్! మీ నష్టాన్ని మాటల్లో వర్ణించలేము! మీ కుమార్తెకు మా సానుభూతి. కానీ కచ్చితంగా మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము అని ఒకరు వ్యాఖ్యానించగా,. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు. "ఆమె మీతో ఉంటుంది! జీవితం మీద ఆశ కోల్పోకండి. నిరుత్సాహపడకండి బ్రో. మీ సంతోషంలోనే తన ఆనందం ఉంటుంది.. మీ బాధను అర్థం చేసుకోగలం. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం... అని ఒకరు వ్యాఖ్యానించారు.
మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్కూల్ లో తను ఎంతో యాక్టివ్ గా ఉండేది. ఆమె మృతదేహాన్ని విచారణ నిమిత్తం పోస్టుమార్టానికి తరలించారు. మరోవైపు ఆమె మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.