లవ్ మ్యారేజే చేసుకుంటా కానీ..
ఇప్పుడు విజయ్ ఏమో తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.
ఫ్యామిలీ స్టార్ సినిమాతో నెక్స్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ వారం ముందుగానే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ తెలుగు వెర్షన్ లో లోనే కాదు తమిళంలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు చెన్నై వెళ్లిన విజయ్ దేవరకొండకు పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటారా అని అడగిన రిపోర్టర్ కు ఈ ఇయర్ కాదు కానీ చేసుకుంటానని సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
లవ్ ఆర్ అరేంజ్డ్ అన్న దానికి ఏమాత్రం ఆలస్యం లేకుండా లవ్ మ్యారేజే అని అన్నాడు. లవ్ మ్యారేజే కానీ ఆ అమ్మాయి తన పేరెంట్స్ కి కూడా నచ్చాలని అన్నాడు. విజయ్ దేవరకొండ లవ్ మ్యారేజ్ అనగానే ఆల్రెడీ అతను లవ్ లో ఉన్నాడని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. రష్మికతో విజయ్ దేవరకొండ క్లోజ్ గా ఉండటం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎన్నాళ్ల నుంచో వార్తలు వస్తున్నాయి.
మొన్నామధ్య రష్మిక ఏమో విజయ్ దేవరకొండ లాంటి భర్త రావాలన్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు విజయ్ ఏమో తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అని ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు.
విజయ్ లవ్ మ్యారేజ్ అని చెప్పిన నెక్స్ట్ ప్రశ్ననే రష్మికతో మీరెప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్న వచ్చింది. చేద్దాం రష్మికతో కలిసి సినిమా చేస్తా అని అన్నారు. ఇలా విజయ్ రష్మిక తమ మధ్య ఏముందో ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు.
విజయ్ రష్మిక గీతా గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇద్దరి కాంబో మీద విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు. ఓ పక్క రష్మిక నేషనల్ స్టార్ గా సూపర్ ఫాం కొనసాగిస్తుండగా మరోపక్క విజయ్ తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుంటా అని అంటున్న విజయ్ దేవరకొండ ఆ చేసుకోబోయే అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తాడా అని ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.