VD14: ఆ క్యారెక్టర్ మళ్ళీ పుష్ప స్టైల్ లోనే..

విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘VD 14’ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2024-07-02 06:09 GMT

విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘VD 14’ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

VD 14’ కథ 19వ శతాబ్దానికి చెందిన రాయలసీమ ప్రాంతంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందింది. 1854 నుండి 1978 వరకు జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా ప్రేక్షకులను ఒక ఎపిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ మరియు రాహుల్ సంకృత్యాన్‌ల కలయికలో వచ్చిన రెండవ చిత్రం.

‘టాక్సీవాలా’ సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి చిత్రాలు విజయవంతం కావడంతో ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమాలో విజయ్ కు జోడిగా రష్మిక మందన్న నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more!

ఇప్పటికే ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి ఆమె రాయలసీమ యాసలోనే నటించబోతున్నట్లు సమాచారం. పుష్ప సినిమాలో చిత్తూరు యాస లో సరికొత్త డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్న రష్మిక ఈసారి అంతకంటే భిన్నంగా మెప్పించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన గీత గోవిందం బిగ్ హిట్ గా నిలిచింది. అనంతరం డియర్ కామ్రేడ్ లో కూడా కలిసి నటించారు.

‘VD 14’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రాయలసీమలో ఎక్కువ భాగం జరుగనుంది. ఇక స్టార్ నటీనటులు, టాప్ టెక్నీషియన్లు కలిసి పని చేస్తున్న సినిమా కావడంతో ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండనుందని సమాచారం. ‘VD 14’ పూర్తి వివరాలు మరియు ఇతర అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

Tags:    

Similar News