విజయ్ మరో క్రేజ్ ప్రాజెక్ట్.. లేటెస్ట్ బజ్ ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం.. ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయారు. ఆ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న విజయ్.. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి మూవీని కంప్లీట్ చేస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది.
ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపిన మేకర్స్.. త్వరలోనే సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ గ్లింప్స్.. జూన్ లాస్ట్ లో రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే విజయ్ లైనప్ చూస్తే వావ్ అనాల్సిందే. వరుసగా మూడు పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే టార్గెట్ తో సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఇక రాజాగారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలాతో విజయ్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో ఆ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. "నా చేతుల మీద ఉన్న రక్తం వాళ్ల చావుకు చిహ్నం కాదు.. వ్యక్తిగా నా పునర్జన్మకు సంకేతం" అని మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఓ రేంజ్ లో ఉంది. పోస్టర్ లో నెత్తురుతో నిండిన కత్తి, ఆ కత్తి పట్టిన చెయ్యితో.. 'కత్తి నాదే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే' అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
మరోవైపు, ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేయనున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోయిన్ గా సాయిపల్లవి పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, అందుకే సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తండేల్ మూవీలో యాక్ట్ చేస్తోంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కన్ఫర్మ్ అయ్యారనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.