రైటర్ గా విజయేంద్రప్రసాద్ రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ గా ఉన్న వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. జక్కన్న సినిమాలతో ఆయన ఇమేజ్ అమాంతం పైకి వెళ్ళిపోయింది

Update: 2023-12-08 04:22 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ గా ఉన్న వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. జక్కన్న సినిమాలతో ఆయన ఇమేజ్ అమాంతం పైకి వెళ్ళిపోయింది. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం విజయేంద్రప్రసాద్ స్టోరీస్ కోసం అడుగుతున్నారంటే అతనికి ఏ రేంజ్ గుర్తింపు వచ్చిందో అంచనా వేయవచ్చు. ఇదిలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కేవలం రాజమౌళి సినిమాలకి మాత్రమే కథలు అందించడం లేదు.

బజరంగీ భాయ్ జాన్ సక్సెస్ తర్వాత మణికర్ణిక లాంటి మరో సూపర్ హిట్ స్టొరీని ఇచ్చాడు. ఇప్పుడు సీత ది ఇన్ కారినేషన్ అనే మూవీ బాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు. వీటితో పాటు జక్కన్న, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోయే పాన్ వరల్డ్ కథపై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ కథకి సంబందించిన వర్క్ జరుగుతోంది.

రైటర్ గా ఉన్నవారికి అత్యధికంగా 2 కోట్ల రూపాయిలు పారితోషికం అందుకోవడం చాలా అరుదు. అతని కథతోనే వందల కోట్ల సినిమా చేసిన రైటర్ కి వచ్చే రెమ్యునరేషన్ మాత్రం తక్కువగానే ఉంటుంది. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం రైటర్ గా కథ ఇవ్వడం కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రైటర్ గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే వ్యక్తిగా విజయేంద్రప్రసాద్ ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పడి సూపర్ హిట్ అయతే మాత్రం అతని ఇమేజ్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంద్బి. అప్పుడు అతని కథలకి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. ఎలాగూ నిర్మాతల వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి సంకోచించడం లేదు. ఈ కారణంతో విజయేంద్రప్రసాద్ రెమ్యునరేషన్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న రైటర్ ఒక తెలుగు వాడు కావడం నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. మరి మున్ముందు విజయేంద్ర ప్రసాద్ నుంచి ఇంకెన్ని అద్భుతాలు వస్తాయో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News