దళపతి గోట్ సైలెన్స్ కి రీజన్ ఏంటి..?

దళపతి విజయ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి.

Update: 2024-06-26 12:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా రిలీజ్ అంటే ఆ హీరో ఫ్యాన్స్ చేసే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. తమిళ్ లో నెంబర్ 1 స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆ ఇమేజ్ కి తగినట్టుగానే సినిమా సక్సెస్ లు అందుకుంటున్నాడు. దళపతి విజయ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న సినిమా జి.ఓ.ఏ.టి. సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో త్రిష కూడా ఇంపార్టెంట్ రోల్ లో ఛాన్స్ దక్కించుకుంది. సెప్టెంబర్ 5న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వదిలిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా సాంగ్ ని వదిలారు. దళపతి గోట్ సినిమా మరోసారి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కు మంచి మాస్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

ఐతే సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేసి ఆ తర్వాత అంచనాలను అందుకోలేదని అనుకోవడం కన్నా సినిమా గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా థియేటర్ లో ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే దళపతి గోట్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరగట్లేదని అంటున్నారు. ఇక ఒక సినిమా పూర్తి చేసే వరకు మరో సినిమా గురించి ఆలోచించని విజయ్, గోట్ రిలీజ్ తర్వాత తన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటన్నది చెప్పాలని చూస్తున్నారు.

Read more!

విజయ్ గోట్ తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే తెలుగులో ఈసారైనా విజయ్ వచ్చి ప్రమోషన్స్ చేస్తాడా లేదా అని తెలుగు ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. విజయ్ గోట్ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే యువన్ శంకర్ రాజా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు మ్యూజిక్ అందించారు. విజయ్ గోట్ సినిమాకు మ్యూజిక్ పరంగా కూడా యువన్ తన మార్క్ మ్యూజిక్ తో అందించారని తెలుస్తుంది. మరి గ్రేటెస్ట్ ఆల్ ది టైం గా విజయ్ తన సత్తా చాటుతారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News