విజయ్ GOAT.. ఎందుకలా చేశారు అసలు?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రీసెంట్ గా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం- GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రీసెంట్ గా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం- GOAT మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ డ్యుయల్ రోల్ పోషించిన ఆ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ తెలుగులో మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది. చెప్పాలంటే.. విడుదలకు ముందు కూడా సినిమాపై పెద్దగా ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.
కానీ విజయ్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉండడంతో.. వారంతా మూవీపై హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు షోలు వేయడంతో సినిమా అదిరిపోతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక సీన్ అంతా మారిపోయింది. ఆడియన్స్ అంచనాలను సరిగ్గా అందుకోలేకపోయింది. పాత కథే మళ్లీ చూపించారని సోషల్ మీడియాలో అనేక మంది కామెంట్లు పెట్టారు.
సినిమా మెయిన్ పాయింటే కాపీ అన్న విషయం గుర్తించని కొందరు.. వెంకట్ ప్రభు వెరైటీగా స్టోరీ రాసుకున్నారని పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గోట్ మూవీలో దివంగత విజయ్ కాంత్ ను ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయన రోల్ ను కొన్ని నిమిషాల పాటు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ కాంత్ మూవీ రాజదురై (తెలుగులో రాజసింహ) నుంచే స్టోరీ లైన్ కాపీ చేశారు డైరెక్టర్.
1993లో రిలీజ్ అయిన రాజదురై సినిమాలోని విలన్.. ఓ పోలీస్ ఆఫీసర్ మీద కోపంతో ఉంటాడు. ఆ అధికారి కుమారుడిని ఎత్తుకుపోయి, అతనికి తన తండ్రి మీదనే ద్వేషం కలిగేలా చేస్తాడు. యంగ్ ఏజ్ లోకి వచ్చాక తండ్రి పోలికలతో కనిపించే పోలీస్ కొడుకు.. తన కుటుంబ సభ్యులకు శత్రువుగా మారుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా రాజదురై మూవీ. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో గోట్ మూవీని తెరకెక్కించారు వెంకట్ ప్రభు.
కొడుకు రోల్ లోని విజయ్ ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వయసు తగ్గినట్లు చూపించారు. అదే మూవీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. అంతే కాదు.. సినిమాలోని కొడుకు రోల్ కు ఉన్న నెగిటివ్ షేడ్స్.. క్లైమాక్స్ వరకు అలానే ఉంచారు. అది మరో దెబ్బ. మొత్తానికి వెంకట్.. అవసరం లేని ట్విస్టులు పెట్టి కన్ఫ్యూజ్ చేశారు. డిఫరెంట్ గా ట్రై చేసినా హిట్ అందుకోలేకపోయారు. అసలు స్టోరీ విషయంలో ఎందుకలా చేశారని నెటిజన్లు అడుగుతున్నారు.