విజయ్ మాల్యా కుమారుడి మొదటి పెళ్లి ఫోటో
ఫోటోలో జాస్మిన్ తెల్లటి గౌను ధరించి అందంగా కనిపించగా, సిద్ధార్థ్ క్రిస్ప్ సూట్ లో మెరిసిపోయాడు. ఈ జంట ఓపెన్ గార్డెన్ లో వివాహంలో సందడిగా కనిపించింది.
'కింగ్ ఫిషర్' విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా వివాహం ఈ వారాంతంలో జరిగింది. జూనియర్ మాల్యా తన స్నేహితురాలు జాస్మిన్ను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. జాస్మిన్ తన ఇన్స్టాగ్రామ్ లో మొదటి ఫోటోను షేర్ చేసింది. సిద్ధార్థ్- జాస్మిన్ జంట క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
ఫోటోలో జాస్మిన్ తెల్లటి గౌను ధరించి అందంగా కనిపించగా, సిద్ధార్థ్ క్రిస్ప్ సూట్ లో మెరిసిపోయాడు. ఈ జంట ఓపెన్ గార్డెన్ లో వివాహంలో సందడిగా కనిపించింది. అభిమానులకు తన పెళ్లి ఉంగరాన్ని ప్రదర్శిస్తున్న ఫోటోను జాస్మిన్ షేర్ చేసింది. 'ఎప్పటికీ' అనే క్యాప్షన్‌తో పాటు తమ చేతులు కలిపి ఉన్న ఫోటోని షేర్ చేసింది. పెళ్లి వారం ప్రారంభమైంది అంటూ ఇంతకుముందు కొన్ని ఫోటోలను ఈ జంట షేర్ చేసింది. ఇప్పుడు పెళ్లి అనంతరం మొదటి ఫోటో వైరల్ గా మారుతోంది.
సిద్ధార్థ్ 2023లో జాస్మిన్‌కి ప్రపోజ్ చేశాడు. అతడు హాలోవీన్ సందర్భంగా.. షేర్ చేసిన ఫోటోలలో సిద్ధార్థ్ హాలోవీన్ గుమ్మడికాయగా కనిపించగా, జాస్మిన్ మంత్రగత్తె దుస్తులను ధరించింది. జాస్మిన్ తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ఫోటోలో ప్రదర్శించింది. నా జీవితంలో అత్యుత్తమ రోజు. నా జీవితాంతం నా బెస్ట్ ఫ్రెండ్‌తో గడిపినందుకు కృతజ్ఞతలు. ఈ రోజును ప్రత్యేకంగా మలచడంలో సహాయపడిన ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు అని జాస్మిన్ ఆనందం వ్యక్తం చేసారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో సిద్ధార్థ్ డేటింగ్ చేసాడని అప్పట్లోనే మీడియాలో కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ కొన్ని IPL మ్యాచ్‌లలో కలిసి కనిపించారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కొన్ని మీడియాలు కథనాలు రాసాయి. అయితే వారి మధ్య రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది.