చనిపోయిన ఆ హీరో మళ్ళీ తెరపైకి..

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా GOAT.

Update: 2024-02-14 04:45 GMT

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా GOAT. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. టైం ట్రావెల్ కథతో సిద్ధమ్మవుతోన్న ఈ మూవీలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి 18 ఏళ్ళ యంగ్ లుక్ కూడా ఉంటుందంట. ఈ లుక్ కోసం ఏజ్ రెడ్యూస్ టెక్నాలజీని గ్రాఫిక్స్ లో వాడుతున్నారంట.

ఈ లుక్ కోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. వెంకట్ ప్రభు కథలంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ మూవీలో కూడా విజయ్ కోసం అలనాటి విభిన్నమైన కథాంశం ఎంచుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కథాంశం కాస్తా ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు.

ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ కి జోడీగా నటిస్తోంది. అలాగే ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా మూవీలో ఉన్నారు. ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. రీసెంట్ గా చనిపోయిన ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో విజయ్ కాంత్ ని గెస్ట్ రోల్ లో చూపించాలని అనుకుంటున్నారంట.

కంప్లీట్ గా గ్రాఫిక్స్, సీజ్ లో విజయ్ కాంత్ క్యారెక్టర్ ని సృష్టించి ఈ మూవీలో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో యమదొంగ సినిమా కోసం రాజమౌళి ఈ టెక్నాలజీ ఉపయోగించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పాత్రని రీక్రియెట్ చేశారు. అయితే అది ఒక పాటకి మాత్రమే పరిమితం అయ్యింది.

అయితే GOAT మూవీలో విజయ్ కాంత్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందంట. 1990 బ్యాక్ డ్రాప్ లో నడిచే కథలో విజయ్ కాంత్ క్యారెక్టర్ ని చూపించబోతున్నట్లు టాక్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు విజయ్ కాంత్ క్యారెక్టర్ ని సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే విజయ్ కాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారంట. ఒక వేళ అలా విజయ్ కాంత్ క్యారెక్టర్ ని సృష్టించి ఈ మూవీలో పెడితే మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవల్ హైప్ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News