రిటైర్‌మెంట్ ప్రకటనపై నటుడు యూటర్న్
ఇకపైనా నటుడిగానే జీవితం. కానీ ఇంతలోనే తాను 2025లో రిటైర్ అవుతానని ప్రకటించి షాకిచ్చాడు.
బాలీవుడ్ లో ఒక్కో సినిమా చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. బుల్లితెర నుంచి వెండితెరకు అతడి ప్రయాణం అసాధారణమైనది. రెండు దశాబ్ధాలుగా నటనలోనే కొనసాగాడు. ఇకపైనా నటుడిగానే జీవితం. కానీ ఇంతలోనే తాను 2025లో రిటైర్ అవుతానని ప్రకటించి షాకిచ్చాడు. ఆ నటుడు ఎవరో పరిచయం అవసరం లేదు. ప్రతిభావంతుడైన విక్రమ్ మాస్సే ఈ ప్రకటన చేసారు. ట్వల్త్ ఫెయిల్, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్న విక్రమ్ తదుపరి వరుస చిత్రాలతో బిజీ అయ్యాడు. కానీ 2025లో నటనకు విరామం ప్రకటించాడు.
కానీ ఇప్పుడు తన ప్రకటనపై యూటర్న్ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇంతకీ విక్రమ్ మాస్సే ఏమంటున్నారు? అంటే..... నేను నటన నుంచి వైదొలుగుతున్నానని చెప్పలేదు. కేవలం బ్రేక్ ఇస్తున్నానని మాత్రమే అన్నాను. కానీ నాపై తప్పుగా ప్రచారం చేసారని వాపోయాడు. 2025లో విడుదల కానున్న మరో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నానని, తాను రిటైర్మెంట్ ప్రకటించడం లేదని, సుదీర్ఘ విరామం తీసుకుంటున్నానని స్పష్టం చేసాడు.
విక్రాంత్ తన పోస్ట్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తన ఉద్దేశ్యం నటన నుంచి విరమించడం కాదని, తన శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి నటన నుండి తాత్కాలిక విరామం తీసుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
నటన మాత్రమే నేను చేయగలను. అది నాకు ఈరోజు ఉన్నదంతా ఇచ్చింది. నా శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. నేను కొంత విరామ సమయం తీసుకోవాలనుకుంటున్నాను.. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను. నేను ఏకాభిప్రాయానికి వచ్చాను. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. అని తెలిపారు. నేను నా కుటుంబంపైనా, ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని విక్రాంత్ మాస్సే అన్నారు.
సెక్టార్ 36, 12వ ఫెయిల్, ది సబర్మతి రిపోర్ట్ చిత్రాలలో చిరస్మరణీయమైన పాత్రలతో విక్రాంత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించాయి.