రెగ్యులర్‌గా ఆ టెంపుల్‌కి స్టార్ కపుల్ ఎందుకు వెళ్తున్నారు?
ఆ తర్వాత పూర్తిగా ఆ ఇద్దరిలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని మీడియ కోడై కూస్తోంది.
జీవితంలో భోగం, త్యాగం, రక్తి, అనురక్తి, సుఖదుఃఖాలు ఇవన్నీ రెగ్యులర్. కానీ ఒకానొక దశలో వయసు రీత్యా మార్పు స్పష్ఠంగా బయటపడుతుంది. అప్పటివరకూ సహచరులతో డేటింగ్ లు ప్రేమాయణాలు అంటూ ఎగ్జయిటింగ్ లైఫ్ ని లీడ్ చేసే కొందరు ఉన్నట్టుండి పెళ్లి సంసారం పిల్లలు అంటూ నిండా బాధ్యతల్లో మునిగిపోతారు. అవి కూడా పూర్తయాక ఏం చేయాలి?
ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ జంట అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ఆధ్యాత్మిక పథంలో ప్రయాణిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. వారికి ఇద్దరు కిడ్స్ జన్మించారు. ఆ తర్వాత పూర్తిగా ఆ ఇద్దరిలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని మీడియ కోడై కూస్తోంది.
ఇటీవల ఈ అందమైన సెలబ్రిటీ కపుల్ మరెవరో కాదు అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ. విరుష్కగా సుప్రసిద్ధులు. ఈ జంట ఇటీవల తమ నివాస స్థలాన్ని మార్చింది. ఇండియా నుంచి నేరుగా లండన్ వెళ్లిపోయారు. అక్కడే ఒక ఇల్లు కొనుక్కుని తమ కిడ్స్ తో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అవసరం అనుకుంటేనే ముంబైకి వచ్చి వెళుతున్నారు. అయితే లండన్ లో ఉన్న కాలంలో ఈ జంట చేస్తున్న మహత్తర కార్యం గురించి అభిమానులు నిరంతరం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
లండన్ వెళ్లాక విరుష్క జంట అక్కడ పూర్తిగా ఆధ్యాత్మికతలో తలమునకలుగా ఉన్నారు. అక్కడ లార్డ్ కృష్ణుని ఇస్కాన్ దేవాలయంలో పూజలాచరిస్తున్నారు. కీర్తన్స్ భజన్స్ అంటూ నిరంతరం ఎప్పుడు చూసినా ఆధ్యాత్మిక చింతనలోనే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ వయసు రీత్యా 40 లోపే ఉన్నారు. విరాట్ కోహ్లీ వయసు 35- అనుష్క శర్మ వయసు 36. ఇంకా నలభై అయినా నిండకుండానే వారు ఇంతగా డివోటీస్ గా మారిపోవడం వెనక కారణం ఏమిటో కానీ, వారు కచ్ఛితంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఇచ్చే గౌరవం ఎంతో గొప్పది అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
ఇస్కాన్ (ISKCON) అంటే అంతర్జాతీయ కృష్ణ సమాజం. లార్డ్ కృష్ణుడు బోధించిన భగవద్గీత- కర్మ సిద్ధాంతాల గురించి ప్రపంచానికి బలమైన టోన్ వినిపించే ఒక సంఘం ఇది. ఇందులో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లిములు అనే విభేధం లేదు. అందరూ సభ్యులే. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు. మనిషికి పునర్జన్మ ఉండకూడదని ప్రభు పాద్ (ఇస్కాన్ వ్యవస్థాపకులు) వారు సూచించారు. ఆల్కహాల్, వ్యభిచారం, బహుభార్యత్వం వంటి విచ్చలవిడితనం తగదనేది ప్రధాన సూత్రం. దీనిని ఆచరించి పాటించేవాడిని కర్మ వెంటాడదు. ఇలాంటి గొప్ప విషయాలెన్నిటినో ఇస్కాన్ బోధిస్తుంది. అలాంటి ఒక సంఘాన్ని అనుసరించడంతో విరుష్క జంటపై అందరి కళ్లు ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక కీలక దశ ఉంటుంది.. సన్మార్గంలో వెళ్లేందుకు. అలాంటి ఒక దశలో ఇప్పుడు విరుష్క జంట ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. వారి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు.