విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఏమన్నాడంటే?
ఈ నేపథ్యంలో తాజాగా ఆ కథనాలపై విశాల్ వివరణ ఇచ్చాడు. 'నాకు ఇంత గుర్తింపు..హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
స్టార్ హీరోలంతా రాజకీయాల్లోకి తెరంగేట్రం చేయడంతో వాతావరణం వెడెక్కుతోన్న సంగతి తెలసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీలో బరిలో ఉండగా...అటుపై తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. తాతయ్య కరుణానిధి..తండ్రి ఎం.కె స్టాలిన్ వారసత్వాన్ని కొనసాగించడానికి ఉదయ్ సీన్ లోకి వచ్చాడు. ఆయన రంగంలోకి దిగిన ఏడాది కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ కూడా ఇటీవలే కొత్త పార్టీతో తెరంగేట్రం చేసేసాడు.
ఈ సన్నివేశాలన్ని జయలలిత స్వర్గస్తులైన తర్వాత చోటు చేసుకోవడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే సరైన సమయంగా భావించి విజయ్ పార్టీ స్థాపించాడు. 2026 ఎన్నికల బరిలోకి దిగుతుననట్లు అధికారికంగా ప్రకటించాడు. దీంతో తెలుగు నటుడైన తమిళనాడులో ఫేమస్ అయిన విశాల్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం మళ్లీ ఊపందుకుంది. వాస్తవానికి విశాల్ రాజకీయాలపరంగా ఆసక్తిగా ఉన్నాడని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.
అందుకు తగ్గట్టు నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం...ప్రత్యర్ధిగా ఉన్న సమయంలో అధ్యక్షుల్ని ప్రశ్నించడం వంటి వాటిలో విశాల్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. దీంతో రాజకీయాంలంటే విశాల్ కూడా ఆసక్తిగానే ఉన్నాడని చాలా కాలంగా వినిపిస్తుంది. ఆయన చేస్తోన్న సామాజిక కార్యక్రమాలు కూడా రాజకీయ తెరంగేట్రం కోసమేనని ప్రచారంలోకి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే విజయ్ ఎంట్రీ తర్వాత విశాల్ కూడా ఏదో పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమంటూ నాలుగైదు రోజులుగా మరోసారి చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఆ కథనాలపై విశాల్ వివరణ ఇచ్చాడు. 'నాకు ఇంత గుర్తింపు..హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు చేతనైన సాయం చేయాలనే ఉద్దేశంతోనే దేవి పౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసాను. విద్యార్ధులను చదివిస్తున్నా. రైతులకు సాయం చేసా. లాభాలు ఆశించి ఏ పని చేయలేదు. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా' అని తెలిపాడు.