ఇంట్రెస్టింగ్ మూవీ కి తొలగిన అడ్డంకులు

డబ్బు అడిగితే చూద్దాం అన్నట్లుగా దాటవేస్తూ వచ్చాడు. దాంతో గత ఏడాది లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

Update: 2023-09-12 12:22 GMT

విశాల్ ద్వి పాత్రాభినయం చేసిన 'మార్క్‌ ఆంటోని' సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ఒక వైపు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు కోర్టు స్టే విధించింది.. ఎలా విడుదల చేస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది.

మార్క్ ఆంటోనీ సినిమా విడుదలపై లైకా ప్రొడక్షన్స్ వారు స్టే తీసుకు రావడం తో విశాల్ అండ్ టీమ్ టెన్షన్ పడ్డారు. కానీ తాజాగా కోర్టు మార్క్ ఆంటోనీ సినిమా విడుదలకు ఇచ్చిన స్టే ను తొలగించింది. విశాల్ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదు అంటూ స్వయంగా కోర్టు ప్రకటించడంతో సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.

విశాల్, లైకా ప్రొడక్షన్స్ వివాదం విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం లైకా ప్రొడక్షన్స్ వారు భారీ మొత్తం లో డబ్బును విశాల్ కు ఇచ్చి సినిమా చేయమన్నారట. కానీ విశాల్ మాత్రం సినిమా చేయకుండా టైమ్ పాస్‌ చేయడం జరిగింది. డబ్బు అడిగితే చూద్దాం అన్నట్లుగా దాటవేస్తూ వచ్చాడు. దాంతో గత ఏడాది లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

కోర్టు లో వాదనలు విన్న తర్వాత విశాల్ రూ.15 కోట్ల రూపాయలను లైకా ప్రొడక్షన్స్ వారికి ఇవ్వాల్సిందే అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ మొత్తం ఇచ్చిన తర్వాత మాత్రమే విశాల్ సినిమా లు థియేటర్‌ రిలీజ్ లేదా ఓటీటీ రిలీజ్ చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. విశాల్ ఆ మొత్తం ఇవ్వలేదు అంటూ లైకా వారు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదలైంది.

విశాల్‌ నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమా పై లైకా వారు రిలీజ్ ఆపాలంటూ స్టే తీసుకు రావడం జరిగింది. లైకా వారితో ఎలాంటి చర్చలు జరిగాయి, కోర్టు లో ఎలాంటి వాదనలు జరిగాయో కానీ చివరకు మార్క్ ఆంటోనీ సినిమా పై ఉన్న స్టే తొలగి పోయిందని తమిళ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News