బిగ్ బాస్ 8 : మెగా ఛీఫ్ గా గెలిచింది ఎవరంటే..

ఈ క్రమంలో ఫైనల్ గా విష్ణు ప్రియ ఈ వారం మెగా చీఫ్ గా గెలిచింది. యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో తన సత్తా చాటుతుంది

Update: 2024-10-25 14:05 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం బీబీ రాజ్యం అనే టాస్క్ నడుస్తుంది. రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ మధ్య ఈ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ఐతే ఈ టాస్క్ లో ఇచ్చిన అన్ని రౌండ్లలో ఎక్కువ శాతం ఓజీ క్లాన్ మెంబర్స్ విన్ అయ్యారు. గెలిచిన ఓజీ క్లాన్ నుంచి మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపికయ్యారు. నిఖిల్ తో పాటు పృధ్వి, ప్రేరణ, విష్ణు ప్రియ ఓజీ క్లాన్ నుంచి మెగా చీఫ్ కంటెండర్ గా ఉండగా రాయల్ క్లాన్ నుంచి రోహిణి, తేజ ఉన్నారు. ఐతే వీరిలో ఎవరు మెగా చీఫ్ అవ్వాలన్నా మిగతా హౌస్ మెట్స్ మీద ఆధారపడి ఉంటుంది.

మెగా చీఫ్ కంటెండర్స్ అయిన ఆరుగురిలో ఎవరికి ఆ అర్హత లేదన్నది మిగతా వాళ్లంతా కూడా ఇచ్చిన టాస్క్ లో ప్రతి రౌండ్ లో చాక్ సాధించి ఆ మిరపకాయల దండ అర్హత లేని వారి మీద వేయాలి. అలా ఒక్కొక్కరు చీఫ్ కంటెండర్ గా తొలగిపోతే చివరికి మిగిలిన వారు మెగా చీఫ్ అవుతారు. ఐతే ఈసారి ఓజీ క్లాన్ నుంచే మెగా చీఫ్ అవ్వాలన్న కసితో ఓజీ క్లాన్ మెంబర్స్ ఆడారు.

ఈ క్రమంలో ఫైనల్ గా విష్ణు ప్రియ ఈ వారం మెగా చీఫ్ గా గెలిచింది. యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో తన సత్తా చాటుతుంది అనుకుంటే ఆమె నిరాశపరుస్తుంది. కేవలం పృధ్వి తో క్లోజ్ గా ఉండటం తప్ప ఆమె ఏమి చేయట్లేదు. అసలు విష్ణు ప్రియ హౌస్ లోకి ఎందుకు వెళ్లింది అన్నట్టుగా ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఐతే ఈమధ్యనే పృధ్వితో తనకున్న రిలేషన్ పై ఒక క్లారిటీకి వచ్చి కొద్దిగా తగ్గిస్తే బెటర్ అనుకున్న అమ్మడు తన ఆట మీద ఫోకస్ పెట్టాలని భావిస్తుంది.

అలాంటి టైం లోనే విష్ణు ప్రియకు మెగా చీఫ్ గా ఛాన్స్ వచ్చింది. మెగా చీఫ్ గా వారం ఇమ్యూనిటీ పొందటం వరకు ఓకే కానీ మెగా చీఫ్ గా తన ఆట మెరుగు పరచుకుంటే కచ్చితంగా టాప్ 5 లో విష్ణు ప్రియ ఉండే ఛాన్స్ ఉంది. కాదు మళ్లీ ఈ పులిహోర కార్యక్రమాలే చేస్తే మాత్రం ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఆడియన్స్ ప్రయత్నిస్తారు.

Tags:    

Similar News