విశ్వక్ సేన్ జిత్తూ పటేల్..?
విశ్వక్ సేన్ సినిమాలకు టైటిల్స్ భలే ఉంటాయి. సినిమా కథకు తగినట్టుగానే కాకపోతే విశ్వక్ మార్క్ మాస్ టైటిల్స్ పెడుతుంటాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలాతో గట్టి షాకే తిన్నాడు. సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న విశ్వక్ సేన్ రిజల్ట్ చూసి చాలా నిరుత్సాహ పడినట్టు తెలుస్తుంది. ఐతే లైలా రిజల్ట్ తో కెరీర్ గురించి కాస్త సీరియస్ గా ఆలోచించిన విశ్వక్ నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా ఫోకస్ తో ఉంటున్నాడని తెలుస్తుంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం అనుదీప్ కే.వితో ఫంకీ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ ప్రిన్స్ తో పర్వాలేదు అనిపించాడు. అనుదీప్ ఫంకీ కూడా అనుదీప్ మార్క్ కామెడీతో పాటుగా విశ్వక్ సేన్ మార్క్ మాస్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది.
ఇక విశ్వక్ సేన్ ఈ సినిమాతో పాటు ఈ నగరానికి ఏమైంది 2, ఫలక్ నుమా 2 ని కూడా చేసే ప్లానింగ్ లో ఉన్నాడట. ఐతే వీటితో పాటు భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర తో ఒక సినిమా చర్చల్లో ఉందని టాక్. సాగర్ చంద్ర చెప్పిన కథకు విశ్వక్ సేన్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ కూడా లాక్ చేశారని తెలుస్తుంది. విశ్వక్ సేన్ సాగర్ చంద్ర కాంబో సినిమాకు జిత్తూ పటేల్ అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తుంది.
విశ్వక్ సేన్ సినిమాలకు టైటిల్స్ భలే ఉంటాయి. సినిమా కథకు తగినట్టుగానే కాకపోతే విశ్వక్ మార్క్ మాస్ టైటిల్స్ పెడుతుంటాడు. విశ్వక్ సేన్ జిత్తూ పటేల్ కథా విశేషాలేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. విశ్వక్ ఓకే చెప్పడంతో ఫుల్ స్క్రిప్ట్ మీద ఫోకస్ పెట్టాడట సాగర్ చంద్ర. విశ్వక్ సేన్ ఫంకీ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. యువ హీరోల్లో తన మార్క్ నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న విశ్వక్ సేన్ ఈమధ్య వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ రిస్క్ లో పడేసుకున్నాడు.
ఐతే తన స్టామినా ప్రూవ్ చేసుకునేందుకు విశ్వక్ సేన్ ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు. అనుదీప్ తో చేస్తున్న ఫంకీ కంప్లీట్ ఎంటర్టైనర్ కాగా సాగర్ చంద్ర జిత్తూ పటేల్ మాత్రం మరోసారి మాస్ కా దాస్ మాస్ మేనియా ఏంటో చూపించేలా ఉంటుందని అంటున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా కెరీర్ మీద ఇప్పుడు మరింత ఫోకస్ తో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో రాబోతున్న సినిమాలతో మాస్ కా దాస్ మాస్ మేనియా చూపిస్తాడని చెప్పొచ్చు.