విశ్వక్ సేన్.. ఫ్యూచర్ ప్లానింగ్ గట్టిగానే..

బేసిక్ గా విశ్వక్ సేన్ కూడా డైరెక్టర్ గా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు.

Update: 2024-07-04 14:13 GMT

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా విశ్వక్ నటనతో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను కూడా ఫినిష్ చేసుకుంది. ఇక విశ్వక్ సేన్ సినిమాల పరంగా చాలా స్ట్రాంగ్ బ్యాక్ అప్ పెట్టుకొని ఉన్నట్లు తెలుస్తోంది. బేసిక్ గా విశ్వక్ సేన్ కూడా డైరెక్టర్ గా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో బలమైన కథలని సిద్ధం చేసుకుంటున్నాడంట.

ఇప్పటికే అతని మైండ్ లో చాలా కథలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా విశ్వక్ సేన్ దృష్టిలో ఉన్నారు. ప్రస్తుతం మెకానిక్ రాకీ అనే సినిమాని విశ్వక్ సేన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తాజాగా రామనారాయణ్ దర్శకత్వంలో లైలా మూవీ స్టార్ట్ చేశాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. దానికి సంబందించిన ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. లైలా మూవీ డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

Read more!

అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేద్దామనే ఆలోచనతో ఉన్నాడంట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తనలోని మాస్ యాంగిల్ ని కూడా చూపించాడు. బలమైన కథ, కథనాలు ఉంటే క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ ఎవరితో అయినా సినిమా చేయడానికి విశ్వక్ సేన్ సిద్ధంగా ఉంటాడు. అలాగే క్యారెక్టర్ కి తగ్గట్లుగా తనని తాను మార్చేసుకుంటాడు అని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ప్రూవ్ అయ్యింది.

అందుకే చాలా మంది డైరెక్టర్స్ విశ్వక్ సేన్ తో మూవీస్ చేయాలని అప్రోచ్ అవుతున్నారంట. అతను కూడా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. తాజాగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ చెప్పిన స్టోరీ విశ్వక్ విన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే విశ్వక్ సేన్ ఇంకా అనుదీప్ కథకి ఒకే చెప్పలేదని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని వస్తే అప్పుడు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

ఇలా చేతిలో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఎలా చేయాలనేది లైన్ అప్ పెట్టుకోలేదంట. ప్రస్తుతం చేస్తోన్న రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సినిమాల గురించి ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ విశ్వక్ సేన్ అనుదీప్ కి ఒకే చెబితే కచ్చితంగా ఆ టాలెంటెడ్ డైరెక్టర్ దశ తిరిగినట్లే అని చెప్పాలి. జాతిరత్నాలు తర్వాత తమిళ్ స్టార్ శివకార్తికేయన్ తో అనుదీప్ ప్రిన్స్ మూవీ చేశాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. తరువాత వెంకటేష్, రవితేజతో ప్రాజెక్ట్స్ అనుకున్న పట్టాలెక్కలేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ పేరు వినిపిస్తోంది. మరి విశ్వక్ అతనికి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News

eac