ప్రతీ నా కొడుకు అంటూ.. విశ్వక్ సేన్ ఆవేశం!
ఎటుంవటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కెరీర్లో స్టార్ స్టేటస్ అందుకున్న మాస్ హీరో విశ్వక్ సేన్.
ఎటుంవటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కెరీర్లో స్టార్ స్టేటస్ అందుకున్న మాస్ హీరో విశ్వక్ సేన్. ఆయన - నేహా శెట్టి కాంబోలో రాబోతోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలన్నీ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నేహా శెట్టి అందాలు, విశ్వక్ సేన్ - నేహా శెట్టి కెమిస్ట్రీ బాగా అదిరిపోయింది. అయితే ఇప్పుడీ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో ఓ సందిగ్ధత నెలకొంది. దీనిపై విశ్వక్ సేన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసలీ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 29 లేదా జనవరి అని అంటున్నారు. దీంతో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా. డిసెంబర్ 8న వస్తున్నా. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ మీ డెసిషన్. ఆవేశానికి లేదా ఇగోకు తీసుకునే డెసిషన్ కాదు. తగ్గే కొద్దీ మింగుతామని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తి పోద్ది. గంగమ్మ తల్లి కి నా ఒట్టు. మహాకాళి మాతో ఉంది. డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రమోషన్స్‌లో చూడరు" అంటూ విశ్వక్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సినిమా విడుదల తేదీ విషయంలో ఏదైనా జరిగిందా అనే చర్చ గట్టిగా నడుస్తోంది. అందుకే విశ్వక్ ఇలా సోషల్ మీడియా ద్వారా మండిపడినట్లు అర్థమవుతోంది. కాగా, డిసెంబర్ 7, 8 తేదీల్లో చాలా సినిమాలే వస్తున్నాయి. నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వస్తున్నాయి. అందుకే విశ్వక్ సేన్ చిత్రాన్ని వాయిదా వేయాలని అనుకున్నారట.
విశ్వక్ చేసిన కామెంట్స్ బట్టి చూస్తే.. పోస్ట్ పోన్ చేయాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారేమో అని కూడా అనుకుంటున్నారు. అసలు ఇంతా వివాదం జరుగుతున్నప్పుడు.. సినిమాను నిర్మించిన సితార బ్యానర్ ఏం చేస్తుంది? నాగవంశీ ఇలా వెనక్కి తగ్గుతారా? అసలీ వివాదం ఎందుకు వచ్చిందనేది అని తెగ మాట్లాడుకుంటున్నారు.