'బాగానే ఎక్స్ ట్రాలు'.. విశ్వక్ మరో కౌంటర్

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే.

Update: 2024-06-23 09:47 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తనకు నచ్చని విషయంపై ఓపెన్ గా స్పందిస్తుంటారు. తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటారు. కొన్ని రోజుల క్రితం తన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెగిటివ్ రివ్యూల విషయంలో ఘాటుగా స్పందించారు. గామి విషయంలో కూడా కౌంటర్ ఇచ్చారు.

రీసెంట్ గా కల్కి 2898 ఏడీ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన యూట్యూబర్ ను విశ్వక్ సేన్ ఓ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. తన ఇన్ స్టా స్టోరీలో ఆ యూట్యూబర్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండని, అప్పుడు మీతోపాటు మీ ఒపీనియన్‍ కు కాస్త అయినా గౌరవం ఉంటుందని సవాల్ విసిరారు. దీంతో విశ్వక్ కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అదే సమయంలో విశ్వక్ చేసిన కామెంట్స్ పై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి ట్రోల్స్ చేస్తున్నారు. కావాలనే ఆయన పోస్టులకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల విశ్వక్ సేన్.. తన ఇన్ స్టాలో పబ్ లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు. దీంతో ఓ నెటిజన్ అతిగా ప్రవర్తించాడు. “అన్నా ఫోటో బాగుంది ఓహ్ సారీ సారీ మర్చిపోయా.. ఒపీనియన్ చెప్పాలంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి కదా” అంటూ అత్యుత్సాహం ప్రదర్శించాడు.

అయితే విశ్వక్ సేన్ కంట ఆ కామెంట్ పడింది. దీంతో ఆ నెటిజన్ ను ట్యాగ్ చేసి 'బాగానే ఎక్స్ ట్రాలు' అంటూ సింపుల్ గా ఇచ్చి పడేశారు విశ్వక్. ఇప్పుడు ఆ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకా రిలీజ్ కాని సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన య్యూటూబర్ కు విశ్వక్ కౌంటర్ ఇవ్వడంలో తప్పు లేదని చెబుతున్నారు. అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచిస్తున్నారు.

ఇక విశ్వక్ సినిమాల విషయానికొస్తే.. 2024లో అప్పుడే రెండు చిత్రాలతో వచ్చేశారు విశ్వక్. గామిలో అఘోరగా కనిపించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మెకానిక్ రాకీ, లైలా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. త్వరలో ఈ రెండు చిత్రాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి విశ్వక్ కొత్త మూవీస్ ఎలాంటి హిట్ అవుతాయో.

Tags:    

Similar News