విశ్వంభర : ఆ విషయంలో ఫ్యాన్స్ కి పండగ

ఈ సినిమాలో చిరంజీవి ని డామినేట్‌ చేసే విధంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ మరియు సెట్స్ ఉంటాయనే ప్రచారంను యూనిట్‌ సభ్యులు చేస్తున్నారు.

Update: 2024-08-02 08:30 GMT

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర అనడంలో సందేహం లేదు. బింబిసార వంటి విభిన్నమైన సోషియో ఫాంటసీ సినిమాను తీసి సూపర్‌ హిట్‌ దక్కించుకున్న దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా రూపొందుతోంది.

చాలా ఏళ్ల తర్వాత చిరంజీవిని సోషియో ఫాంటసీ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కనుక అంచనాలు మరింత పెరిగాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాల్లో ఎక్కువ శాతం భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక విశ్వంభర అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వంభర సినిమాలో చిరంజీవి ఉండటం ప్రధాన ఆకర్షణ అంటే అంతకు మించి అన్నట్లుగా విజువల్స్ ఉండబోతున్నాయట. సాధారణంగా చిరంజీవి ఉంటే మిగిలినవి అన్నీ కూడా చిన్నబోతాయి. కానీ ఈ సినిమాలో చిరంజీవి ని డామినేట్‌ చేసే విధంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ మరియు సెట్స్ ఉంటాయనే ప్రచారంను యూనిట్‌ సభ్యులు చేస్తున్నారు.

సినిమా కోసం నిర్మాతలు చేస్తున్న ఖర్చులో అత్యథిక మొత్తంను సెట్స్ మరియు వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కోసం కేటాయించాడట దర్శకుడు. చిరంజీవి స్థాయి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు అంటూ మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారికి ఈ సినిమాతో పూర్తి స్థాయి సంతృప్తి దక్కడంతో పాటు, వారికి పండగ ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పలువురు ముద్దుగుమ్మలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి ని హిట్లర్ తర్వాత అన్నయ్యగా ఈ సినిమాలో చూడబోతున్నామని కూడా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు వచ్చిన వార్తలు, యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న లీక్ ల నేపథ్యంలో ఫ్యాన్స్ అందరికి 2025 సంక్రాంతి డబుల్‌ అయ్యే విధంగా విశ్వంభర ఉంటుందని మీడియా వర్గాల వారు భావిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు పాటల రికార్డింగ్‌ కూడా పూర్తి అయ్యాయి. అక్టోబర్ వరకు షూటింగ్‌ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News