విశ్వంభర భారీ టార్గెట్ తోనే వస్తున్నాడా..?

ఈమధ్య ఆడియన్స్ అంతా కూడా రియలిస్టిక్ స్టోరీస్ కన్నా కూడా తమ ఊహలకందని విజువల్ వండర్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Update: 2024-04-06 07:15 GMT

ఈమధ్య ఆడియన్స్ అంతా కూడా రియలిస్టిక్ స్టోరీస్ కన్నా కూడా తమ ఊహలకందని విజువల్ వండర్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ తో మాయ చేసి చూపిస్తే వారెవా అనేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఇలా విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఇప్పుడు అలాంటి భారీ అటెంప్ట్ తోనే వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార సినిమాతో సక్సెస్ అందుకున్న వశిష్ట చిరుని మెప్పించే కథ చెప్పాడంటే అందులో మ్యాటర్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

చిరంజీవి రీ ఎంట్రీ టైం నుంచి రొటీన్ కథలనే చేస్తున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. అందుకే అలాంటి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న మెగా బాస్ విశ్వంభర అనే మెగా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా కథ కథనం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారు. తప్పకుండా మెగా ఫ్యాన్స్ అంతా కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే కథాంశం తో విశ్వంభర వస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా టార్గెట్ కూడా భారీగానే పెట్టుకున్నారని తెలుస్తుంది. చిరు సినిమాలు హిట్ అయితే తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వసూళ్లను రాబడతాయి. అయితే విశ్వంభర సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా వస్తుంది. అసలు సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటన్నది లీక్ అవ్వలేదు.

చిరు మాత్రం ఈ సినిమాలో సూపర్ హీరో రేంజ్ లో కనిపిస్తారని తెలుస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా 157 వ సినిమాగా వస్తున్న విశ్వంభర ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం సినిమా 500 కోట్లు రీచ్ అవ్వడం కష్టమేమి కాదని అంటున్నారు. అయితే రాజమౌళి తరహాలో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా ఆడియన్స్ కు ఎక్కించాలనే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. మరి మెగా విశ్వంభర మెగా సెన్సేషన్ గా మారుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి క్రేజీ స్టోరీ టెల్లర్ గా వశిష్ట విశ్వంభరతో కూడా తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News