గుంటూరు సెట్ లో విశ్వంభర విశ్వరూపం!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ` విశ్వంభర` షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ` విశ్వంభర` షూటింగ్ శర వేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మారుడుమిల్లి అందాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ మలి షెడ్యూల్స్ హైదరాబాద్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏకంగా 13 ప్రత్యేకమైన సెట్లు నిర్మించి అక్కడే షూటింగ్ చేస్తున్నారు. ఆ సెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో మాయావనం లాంటి సెట్లు నిర్మించి అక్కడే ప్రత్యేకమైన సన్నివేశాలు చిత్రీకరి స్తున్నారు.
ఇటీవలే చిరంజీవి కూడా రెగ్యులర్ గా షూట్ లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ గా ఎంపికైన త్రిష కూడా హాజరవుతుంది. ప్రస్తుతం వాళ్లిద్దరిపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. తొలి షెడ్యూల్ లో చిరంజీవి...త్రిష లేని సన్నివేశాలే చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ప్రస్తుతం షూటింగ్ `గుంటూరు కారం` కోసం నిర్మించిన సెట్స్ లో చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో కొల్లోరు లో ప్రత్యేకమైన సెట్ నిర్మించింది గుంటూరు యూనిట్. అయితే అలాంటి లొకేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలు కొన్ని ఉండటంతో ఆ సెట్ ని విశ్వంభర చిత్ర యూనిట్ వినియోగించుకుంటుందిట. ఈ షూట్ లో చిరు-త్రిషలు పాల్గొంటున్నట్లు తెలిసింది. హైదరాబాద్ షూట్ తో పాటు సైమల్టేనియస్ గా ఇక్కడా షూట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే లీక్ అయిన సంగతి తెలిసిందే.
దొరబాబు పాత్ర అనేది మాస్ లుక్ తో డిజైన్ చేసి ఉంటుందని తెలిసింది. ఆ పాత్రకి సంబంధించిన సన్ని వేశాలో గుంటూరు కారం సెట్స్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో త్రిషని ఇంకెంత అందంగా చూపిస్తారు? అన్నది చూడాలి. త్రిషకి 40 ఏళ్లు మీద పడినా బ్యూటీ అంతకంతకు రెట్టింపు అవుతుందే? తప్ప తరగని అందంలా కనిపిస్తుంది.