ఇష్ట‌ప‌డిన అమ్మాయి క్యాన్స‌ర్ తో చ‌నిపోవ‌డంతో!

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఆయ‌న గురించి కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నారు. 'నేను బాగా ఇష్ట‌ప‌డిన అమ్మాయి క్యాన్స‌ర్ తో చ‌నిపోయింది.

Update: 2024-09-20 23:30 GMT

బాలీవుడ్ న‌టుడు వివేక్ ఓబెరాయ్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. తెలుగు సినిమాలు చేసిన న‌టుడాయ‌న‌. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఆయ‌న గురించి కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నారు. 'నేను బాగా ఇష్ట‌ప‌డిన అమ్మాయి క్యాన్స‌ర్ తో చ‌నిపోయింది. ఆ త‌ర్వాత రిలేష‌న్ షిప్స్ పై ఇంట్రెస్ట్ చూపించ‌లేదు. ల‌వ్ విష‌యంలో కాలేజీ రోజుల్లోనే చాలా క్లారిటీగా ఉండేవాడిని.

 

చ‌దువు, వ్యాపారం, స్టాక్ మార్కెట్ ఇలా ప‌నులతో చాలా బిజీగా ఉండేవాడిని. ల‌వ్ లో ఫెయిలైన త‌ర్వాత హార్ట్ బ్రేకింగ్ వంటివి సీరియ‌స్ గా తీసుకోవ‌డం న‌చ్చ‌దు. కొన్ని ఎదురు దెబ్బ‌ల అనంత‌రం ప్రెండ్ షిప్ మాత్ర‌మే వ‌ర్కౌట్ అవుతుంద‌ని నిర్ణ‌యించుకున్నా. చాలా మంది అమ్మాయిల‌తో ప‌రిచ‌యం ఉన్నా? వాళ్ల‌లో ఎవ‌ర్నీ గ‌ర్ల్ ప్రెండ్ గా గుర్తించ‌ను. ప్రేమ‌లో పడితే మాత్రం నిజాయితీగా ఉండేవాడిని.

ఆమె గురించి నిరంత‌రం ఆలోచించే వాడిని. నాకు త‌గిలిన ఎదురుదెబ్బ‌ల‌తో పెళ్లి చేసుకోకూడ‌దు అనుకు న్నా. కానీ కుటుంబ స‌భ్యుల బ‌ల‌వంతంతో త‌ప్ప‌లేదు. ప్రియాంక‌ను 2010 లో వివాహం చేసుకున్నా. బిజినెస్ గురించి చిన్న‌ప్పుడు నాన్న ద‌గ్గ‌రే నేర్చుకున్నా. ఆయ‌న మాటతో 10 ఏళ్ల‌కే ఇంటింటికి తిరిగి పెర్ ప్యూమ్ అమ్మా. అప్పుడు చాలా త‌ప్పులు చేసాను.

ఆ త‌ప్పుల‌తో చాలా అవ‌గాహ‌న వ‌చ్చింది. ఆ ధైర్యంతోనే 15 ఏళ్ల‌కే స్టాక్ మార్కెట్ లో పెట్టుబ‌డ‌లు పెట్టాను. సొంత ఆలోచ‌న‌తో 19 ఏళ్ల‌కే కంపెనీ పెట్టా. దాన్ని ఓ ఎమ్ ఎన్ సీకి అమ్మేసా' అని అన్నాడు. తెలుగులో వివేక్ ఓబెరాయ్ 'విన‌య విధేయ రామ‌'లో విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News