గుసగుస.. వైజాగ్ పంపిణీదారుపై గిల్డ్ నిషేధం!?
అంతేకాదు.. తర్వాతి పెద్ద హీరో సినిమాతో పాత నష్టాలను పూడుస్తానని మాటిచ్చిన నిర్మాత ఆ మాటను నిలబెట్టుకోలేదంటూ అతడు కోర్టుకెక్కాడు.
ఇటీవల భారీ సినిమాల విషయంలో అగ్ర పంపిణీదారులకు సవాల్ విసిరాడు వైజాగ్ కి చెందిన సదరు పంపిణీదారు. కానీ ఒకే ఒక్క డిజాస్టర్ సినిమా అతడిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ సినిమా నిర్మాతతో ఇప్పటికీ వివాదం సమసిపోలేదు. నష్టపరిహారం కావాలంటూ కోర్టుకెక్కాడు.
వివాదంపై కోర్టుల పరిధిలో విచారణ సాగుతోంది. అంతేకాదు.. తర్వాతి పెద్ద హీరో సినిమాతో పాత నష్టాలను పూడుస్తానని మాటిచ్చిన నిర్మాత ఆ మాటను నిలబెట్టుకోలేదంటూ అతడు కోర్టుకెక్కాడు. కానీ కోర్టులోను వైజాగ్ కి చెందిన సదరు పంపిణీదారుకు కోర్టులో చుక్కెదురైంది.
చివరకు అతడిని యాక్టివ్ నిర్మాతల గిల్డ్ నిషేధించిందంటూ ఒక గుసగుస ఇటీవల వైరల్ అవుతోంది. దీనికి కారణం అతడు కోర్టుకు కూడా నకిలీ సంతకం ఉన్న సర్టిఫికెట్ ( నిర్మాతతో ఎంవోయు) ని సమర్పించాడని, న్యాయమూర్తులనే మోసం చేయాలని చూశాడని సదరు నిర్మాత ప్రత్యారోపణ చేసారు. అయితే ఇది నిజమా కాదా? అన్నది న్యాయస్థానం తేల్చాల్సి ఉంటుంది.
ఒకవేళ అతడిపై యాక్టివ్ నిర్మాతల గిల్డ్ నిషేధం అమలైతే అది అతడి కెరీర్ కి ఇబ్బందికరం. అతడికి అగ్ర నిర్మాతలు ఎవరూ సినిమాల పంపిణీ హక్కులను కట్టబెట్టేందుకు ముందుకు రారు. అయితే తన నష్టానికి కారకుడైన నిర్మాతపై కోర్టులో న్యాయపోరాటం సాగిస్తూనే ఉంటానని వైజాగ్ పంపిణీదారు అంటున్నారు. మునుముందు ఏం జరగనుందో వేచి చూడాలి.