వైజయంతి సంస్థ ఎందుకు ఉలిక్కి పడుతోంది?
వైజయంతి సంస్థ ఎలాంటి కారణం, సందర్భం లేకుండా ఎందుకిలా ఉలిక్కి పడుతోంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వైజయంతీ మూవీస్..ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటీ జూనియర్ ఎన్టీఆర్ వరకు రెండు తరలా హీరోలతో సినిమాలు నిర్మించి ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటికీ అదే బ్రాండ్‌ని కొనసాగిస్తూ మినిమమ్ గ్యారంటీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు భారీ పాన్ ఇండియా మూవీస్‌ని కూడా నిర్మిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. అయితే ప్రస్తుతం యంగ్ హీరో రోషన్‌తో 'ఛాంపియన్' మూవీని నిర్మిస్తున్న ఈ సంస్థ మరో పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'కల్కి 2898ఏడీ' మూవీని నిర్మిస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో నిర్మిస్తున్న'కల్కి 2898ఏడీ' సినిమాను దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, దీపికా పదుకునే, దిషా పటానీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమాగా రూపొందుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్‌చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల వైజయంతీ సంస్థ మాటి మాటికి ఉలిక్కి పడుతోంది. కారణం లేకుండానే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా హక్కలన్నీ తమవేనని, దీన్ని కాపీ కొట్టినా, స్ఫూర్తి పొందినా, రీమేక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడే ఈ విషయం ఎందుకు గుర్తొచ్చింది?..ఎవరి కోసం ఈ సంస్థ ఉలిక్కి పడుతోంది? అన్నది చర్చనీయాశంగా మారింది.
కావాలనే ఈ సంస్థ వరుస ప్రకటనలు చేస్తోందని, ఏ విషయంలోనో భయాందోళనకు గురవుతూ ఉన్నట్టుండి ఉలిక్కిపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సోమవారం వైజయంతి సంస్థకు ఉన్నట్టుండి ఇంద్రజ శ్రీదేవి హఠాత్తుగా గుర్తొచ్చింది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని శ్రీదేవి ఇంద్రజ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన సదరు సంస్థ స్వచ్ఛత, అమాయకత్వానికి, శాంతికి ప్రతీకగా ప్రేక్షక హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపనోతుందని ప్రకటించారు. శ్రీదేవి బర్త్‌డే కాదు, డెత్ డే కాదు. సినిమా రిలీజ్ డేట్ కూడా కాదు.
వైజయంతి సంస్థ ఎలాంటి కారణం, సందర్భం లేకుండా ఎందుకిలా ఉలిక్కి పడుతోంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైజయంతి భయానికి కారణం చిరు 157 మూవీ అని తెలుస్తోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట ఈ మూవీని సోషియో ఫాంటసీ కథాంశం నేపథ్యంలో తెరపైకి తీసుకురాబోతున్నారు. కథ కూడా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని మెయిన్ పాయింట్ ఆధారంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వైజంతీ వర్గాలని ఉలిక్కిపడేలా చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.