ఆ నాటి బొంబాయి బ్యూటీలా నేటి ఈ బ్యూటీ!
అలాంటి గెటప్ తనికి మాత్రమే సూటవుతుందని మనీషా కోయిరాలా రుజువు చేసింది.
'బొంబాయి' సినిమాలో మనీషా కోయిరాలాని మణిరత్నం ఎంత అందంగా..అద్భతంగా హైలైట్ చేసారో తెలిసిందే. ముస్లిమ్ యువతి పాత్రలో మనీషా ఆహార్యం ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ముస్లిమ్ యువతి గెటప్ లో నేపాల్ బ్యూటీ ఎంతో అందంగా నాటి యవతని అలరించింది. ఆ తర్వాత చాలా మంది దర్శకులు ఆతరహా ప్రయత్నాలు చేసారు గానీ సక్సెస్ అవ్వలేదు. అలాంటి గెటప్ తనికి మాత్రమే సూటవుతుందని మనీషా కోయిరాలా రుజువు చేసింది.
తాజాగా నాటి మనీషా లుక్ నే తలపించింది ఈ బ్యూటీ. తెలుపు వర్ణం దుస్తుల్లో వామికా గబ్బి ముస్తాబైన విధానం..కెమారాకి ఇచ్చిన ఫోజులు చూసి ఒక్క క్షణం నాటి మనీషా కోయిరాలాని గుర్తు చేసిందంటే అతిశయోక్తి కాదు. డార్క్ నైట్లో వైట్ కలర్ బ్యూటీలో ఎంతో అందంగా హైలైట్ అవుతుంది వామికా. నేచురల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఒక్క క్షణం పాటు అమ్మడు బొంబాయి రోజుల్లోకి తీసుకెళ్లిపోయింది. వామికా బ్యూటీకి నెటి జనులు ఫిదా అవుతున్నారు.
ఇక వామికా గబ్బీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. కానీ అమ్మడికి ఇంకా ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. చెప్పుకోవడానికి చాలా సినిమాలు చేసింది. కానీ గుర్తింపును తెచ్చిపెట్టినవి కొన్నిచిత్రాలే. దీంతో బాలీవుడ్ లో పర్మినెంట్ ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మునుపటి కంటే మెరుగ్గానే సినిమాలు చేస్తోంది. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాటిలో సీనియర్ భామలతో కలిసి నటించింది.
ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తోంది. హిందీలో `బేబి జాన్` లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తన్నాడు. ఆయన కు జోడిగా ఫస్ట్ లీడ్లో కీర్తి సురేష్ నటిస్తుండగా, సెకెండ్ లీక్ కి వామికా ఎంపికైంది. ఇందులో అమ్మడి పాత్ర కీలకమైంది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ప్రస్తుతం సెట్స్ లో ఉంది. అన్నిపనులు పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.