`వార్ 2`లో పఠాన్- టైగర్ చేరతారా?
యశ్ రాజ్ ఫిలింస్ లో భారీ స్పై యూనివర్శ్ చిత్రాలు ఇటీవల ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. టైగర్ ఫ్రాంఛైజీతో పాటు, అటు వార్ ఫ్రాంఛైజీలో పలు చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.
యశ్ రాజ్ ఫిలింస్ లో భారీ స్పై యూనివర్శ్ చిత్రాలు ఇటీవల ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. టైగర్ ఫ్రాంఛైజీతో పాటు, అటు వార్ ఫ్రాంఛైజీలో పలు చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. పఠాన్ తో కింగ్ ఖాన్ షారూక్ కూడా ఈ తరహా ఫ్రాంఛైజీ రేస్ లో చేరడంతో ఉత్కంఠ మొదలైంది. ఇంతలోనే వార్ 2లో జూ.ఎన్టీఆర్ ప్రవేశించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారి యష్ రాజ్ ఫిలింస్ లోని భారీ చిత్రంలో టాలీవుడ్ హీరో నటిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది.
హృతిక్ తో వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ నటించాడు. కానీ ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అలాంటి ఒక అవకాశం దక్కింది. తారక్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించనున్నాడు. దీంతో వార్ 2 పై ఇటు సౌత్ లోను బజ్ పెరిగింది.
అయితే వార్ 2లో పఠాన్- టైగర్ 3 తరహాలో ప్రత్యేక అతిథి పాత్ర ఏదైనా ఉంటుందా? అన్న చర్చా సాగుతోంది. పఠాన్ లో సల్మాన్ అతిథి పాత్ర బ్లాక్ బస్టర్ అయింది. కానీ టైగర్ 3లో షారూఖ్ అతిథి పాత్ర ఏమంత కలిసి రాలేదన్న చర్చా సాగుతోంది. ఓవరాల్ గా టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దీంతో ఇప్పుడు యష్ రాజ్ ఫిలింస్ తదుపరి చిత్రాలపై చాలా ఎక్కువగా దృష్టి సారించింది. ముఖ్యంగా వార్ 2లో అతిథి పాత్రలేవీ ఉండవని తాజాగా తెలిపారు. ప్రధాన పాత్రధారులైన ఎన్టీఆర్, హృతిక్ పైనే ఆడియెన్ దృష్టి ఉండాలని యష్ రాజ్ బ్యానర్ భావిస్తోందట. దీంతో వార్ 2లో అతిథి పాత్రలేవీ ఉండవని కూడా తెలుస్తోంది.
టైగర్ 3- పఠాన్ వంటి స్పై యూనివర్స్ చిత్రాలు అతిథి పాత్రలతో ఆశ్చర్యపరిచాయి. దీంతో ఎన్టీఆర్, హృతిక్‌ల వార్ 2కి కూడా ఇలాగే అతిథి జాయిన్ అవుతాడా? అన్న చర్చా సాగుతోంది. కానీ టైగర్ 3 వైఫల్యం ఈ ఆలోచనలకు చెక్ పెట్టింది. వార్ 2లో ఇప్పటికే ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు కాబట్టి, అతిథి పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని మళ్లించకూడదని నిర్మాత ఆదిత్య చోప్రా .. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది.
నిజానికి టైగర్ 3 నెగెటివ్ రిజల్ట్ ఊహించని షాకిచ్చింది. టైగర్ 3కి వచ్చిన అతితక్కువ స్పందన మేకర్స్‌ని ఆలోచించుకునేలా చేసింది. టైగర్ 3 ఆశించిన స్థాయిలో క్రేజ్ పొందకపోవడంతో మేకర్స్ తమ పూర్తి దృష్టిని వార్ 2 పై పెట్టారు. జనవరి 2025లో ఈ సినిమా విడుదలవుతుంది. అంటే ఇంకో ఏడాది పాటు ఈ సినిమా కోసం వేచి చూడాలి. ఈలోగా ఇతర ప్రాజెక్టులపైనా యష్ రాజ్ బ్యానర్ దృష్టి పెడుతుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందాల్సిన టైగర్ వర్సెస్ పఠాన్ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్ .. షారుక్ ఖాన్‌లతో పూర్తి నిడివి గల గూఢచారి డ్రామాను అసాధారణమైన కథతో చేయాలి. దానికి తగ్గట్టు భారీ బడ్జెట్లను వెచ్చించాలి. కాబట్టి యష్ రాజ్ ఫిలింస్ సంస్థ చాలా యోచిస్తోందని సమాచారం.