వార్ 2 నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఫిక్స్..!
ముందు బాడీ డబుల్స్ తో తీసి ఆ తర్వాత వి.ఎఫ్.ఎక్స్ ని వాడి హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్ ఫేస్ లను స్వాప్ చేస్తారని తెలుస్తుంది.
RRR తర్వాత దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే వార్ 2 కోసం కొత్త టెక్నాలజీని వాడుతున్నారని తెలుస్తుంది. వార్ 2 అవుడ్ డోర్ యాక్షన్ ఘట్టాల కోసం బాడీ డబుల్స్ తో షూట్ చేస్తారని తెలుస్తుంది. ముందు బాడీ డబుల్స్ తో తీసి ఆ తర్వాత వి.ఎఫ్.ఎక్స్ ని వాడి హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్ ఫేస్ లను స్వాప్ చేస్తారని తెలుస్తుంది.
కామన్ గా అయితే సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ని డూప్ లతో కానిచ్చేస్తారు. అయితే ఆ టైం లో హీరోలు లొకేషన్స్ లోనే ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సెట్ లో హీరోలు లేకుండానే షూట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సరికొత్త మోషన్ టెక్నాలజీ తో ఈ సీన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది.
వార్ 2 కోసం హృతిక్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం హృతిక్ ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ సినిమాకు గాను హృతిక్ రోషన్ 55 నుంచి 60 కాల్స్ షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వార్ 2 ని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నారని అర్థమవుతుంది. వార్ 2 కోసం తారక్ ఏప్రిల్ లో డేట్స్ ఇచ్చాడట. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరి కాంబో సీన్స్ అన్నీ ముంబైలో జరుగుతాయని తెలుస్తుంది.
జూన్ లేదా జూలైలోనే షూటింగ్ పూర్తి చేసి సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుంటారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమాను నెక్స్ట్ ఇయర్ ఆగష్టు కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 2019 లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 వస్తుంది. అయితే వార్ లో ఉన్న హృతిక్ ఈ పార్ట్ 2 లో కొనసాగుతుండగా అందులో నటించిన టైగర్ ష్రాఫ్ బదులుగా తారక్ వచ్చి చేరాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ వార్ 2 లో భాగం అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.