వార్నర్ హర్ట్ అయ్యారా? రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన వెంకీ!
మార్చి 28న విడుదలకానున్న ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో మంచి హైప్‌ను సంపాదించుకుంది.;

నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా ప్రస్తుతం బిజీగా ప్రమోషన్స్ తో హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాపై మొదటి నుంచి మాస్ ఫీల్ కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో కంటెంట్, ఎంటర్టైన్‌మెంట్, యాక్షన్ హంగామా బాగా కనబడుతుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఇది ఓ మంచి ఎంటర్‌టైనర్ అవుతుందన్న నమ్మకం పెరిగింది. మార్చి 28న విడుదలకానున్న ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో మంచి హైప్‌ను సంపాదించుకుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకతల్లో ఒకటి డేవిడ్ వార్నర్ స్పెషల్ గెస్ట్ రోల్. క్రికెట్‌తో పాటు సోషల్ మీడియాలో రీల్స్‌లోనూ అలరించిన వార్నర్, ‘రాబిన్ హుడ్’లో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, అభిమానుల నుంచి బ్రహ్మరథం పొందాడు. ఇండియాలోని తన క్రేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వార్నర్, ఈ సినిమా షూటింగ్ అనుభవాన్ని కూడా పంచుకున్నాడు.
అయితే ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘‘డేవిడ్ వార్నర్ ఓ దొంగ ముం** కొడుకు. క్రికెట్ ఆడమంటే ఏంటో... బుజం పైకి పెట్టి రీల్స్ చేస్తూ పుష్ప లా ఫీలవుతున్నాడే’’ అంటూ వ్యాఖ్యానించారు. అదీ కాకుండా ‘‘వార్నర్.. ఇదే వార్నింగ్?’’ అంటూ తనదైన శైలిలో సెటైరిక్ కామెంట్ చేశారు. అయితే ఇది సరదా వ్యాఖ్యే అయినా, విదేశీ సెలబ్రిటీని ఈ విధంగా పిలవడం పట్ల నెటిజెన్లలో మిశ్రమ స్పందన కనిపించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా హార్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల స్పందించారు. మీడియాతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ – “రాజేంద్ర ప్రసాద్ గారు అది సరదాగా చెప్పారు. కానీ డేవిడ్ వార్నర్ కాస్త గానీ హర్ట్ అయ్యారేమో అనిపించి, నేనే ముందుగా వార్నర్‌కి క్లారిటీ ఇచ్చాను. ఆయనకు తెలుగు బాగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ‘అది సరదా మాటే.. నువ్వు ఫీల్ అవొద్దు’ అని చెప్పాను,” అని తెలిపారు.
వార్నర్ స్పందన గురించి కూడా వెంకీ వివరించారు. “వార్నర్ ఎంతో కూల్ పర్సన్. ఆయన చెప్పినదీ అదే. ‘‘నేను క్రికెట్‌లో ఎన్నో స్లెడ్జింగ్‌లు చూసాను. ఇది యాక్టింగ్‌లో ఫన్‌గా అనిపించింది. ఆయన ఒక పెద్దవారు, సరదాగా మాట్లాడారు’’ అన్నారు,” అంటూ వెంకీ పేర్కొన్నారు. దీనివల్ల వార్నర్‌కు ఎలాంటి మనసులోనూ బాధ లేదన్న విషయం స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ వివాదాన్ని వార్నర్ చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడు. ఇది యాక్టింగ్‌లో స్లెడ్జింగ్‌లాంటిది.. నేను ఫీలవ్వలేను.. అని చెప్పడం ఆయన ఉదారతను, మంచి మనసును చూపిస్తోంది. ఇక అభిమానులనూ ఏ మాత్రం నిరాశపరచకుండా, సినిమా ప్రమోషన్‌కి స్పీడ్ పెడుతూ రాబిన్ హుడ్ టీం మరోసారి మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది.