ఎంత మాట అన్నావ్‌ నాని బ్రో..!

జాతీయ అవార్డులను ప్రకటించిన సమయంలో జై భీమ్‌ సినిమాకు అవార్డు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో నాని పోస్ట్‌ చేయడం జరిగింది.

Update: 2023-11-09 11:54 GMT

ఇండియా టుడే రౌండ్ టేబుల్ తెలంగాణ కార్యక్రమంలో టాలీవుడ్‌ హీరో నాని పాల్గొన్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ నుంచి రామ్‌ చరణ్ తర్వాత పాల్గొన్న హీరో నాని మాత్రమే. ఆ కార్యక్రమంలో నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు అన్ని విషయాల గురించి నాని తన అభిప్రాయాలను వెల్లడించారు.

జాతీయ అవార్డులను ప్రకటించిన సమయంలో జై భీమ్‌ సినిమాకు అవార్డు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో నాని పోస్ట్‌ చేయడం జరిగింది. ఆ పోస్ట్‌ గురించి, ఆ సందర్భం గురించి నానిని ప్రశ్నించిన సమయంలో తన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మరియు పుష్ప సినిమాలకు జాతీయ అవార్డులు రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించింది. తన సహ నటుడు అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం తనకు గర్వంగా అనిపించింది. అయితే తాను ఎంతగానో ఆశించిన జై భీమ్ సినిమాకు జాతీయ అవార్డ్‌ ఏ విభాగంలో కూడా రాకపోవడం పట్ల చాలా అసంతృప్తి చెందాను.

అసలు జ్యూరీ సభ్యులు జై భీమ్ సినిమా ను చూశారా? లేదా? అంటూ కూడా నాని ప్రశ్నించాడు. జై భీమ్‌ సినిమాను జ్యూరీ సభ్యులు చూశారా అంటూ నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. మరీ సినిమాలు చూడకుండానే అవార్డులను జ్యూరీ ఎంపిక చేస్తుందా నాని అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

జ్యూరీ సభ్యులకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటి అనుసారంగానే అవార్డులను ప్రకటిస్తారు. మనం కోరుకున్నాం కదా అని అవార్డులు ఇవ్వరు కదా నాని అంటూ కొందరు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జై భీమ్‌ సినిమాకు జాతీయ అవార్డు రావాల్సిందని నాని మరోసారి గట్టిగానే వాదించాడు.

తన భాష సినిమాలకు అవార్డు రావడం తన సోదరికి రావడం మాదిరిగా భావిస్తాను. అయితే ఇతర భాషల్లో తనకు నచ్చిన సినిమా కి అవార్డు రావాలని కూడా కోరుకుంటాం కదా అన్నట్లుగా నాని తన వాదనను సమర్ధించుకున్నాడు. ఆ మధ్య తెలుగు సినిమాలకు అవార్డు రావడం నానికి నచ్చలేదా అంటూ కొందరు ప్రశ్నించారు. వారికి సమాధానంగా నాని ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నాని

తెలుగు సినిమాలకు అవార్డ్‌ రావడం సంతోషం కానీ, జై భీమ్ కి రాకపోవడం బాధ కలిగించిందని క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News