రష్మికతో బ్రేకప్ రక్షిత్ ఏమంటున్నాడంటే..?
కొన్నాళ్లు వీళ్ల బ్రేకప్ మ్యాటర్ హెడ్ లైన్స్ లో ఉన్నా తర్వాత తర్వాత ఎవరు పట్టించుకోలేదు.
కిరాక్ పార్టీ డైరెక్టర్ కం హీరో రక్షిత్ శెట్టి ఆ సినిమా హీరోయిన్ రష్మికను ప్రేమించాడన్న విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రష్మికకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ టైం లో రష్మిక మీద తన ప్రేమను వ్యక్తం చేయగా ఆమె కూడా ఓకే చెప్పి ఇద్దరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లారు. కట్ చేస్తే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ రక్షిత్ శెట్టి, రష్మిక ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అన్న దానికి ఇప్పటి వరకు రీజన్ బయటకు రాలేదు.
కొన్నాళ్లు వీళ్ల బ్రేకప్ మ్యాటర్ హెడ్ లైన్స్ లో ఉన్నా తర్వాత తర్వాత ఎవరు పట్టించుకోలేదు. రష్మికని ఒకటి రెండు సార్లు రక్షిత్ తో దూరమైన విషయం గురించి అడగాలని మీడియా ప్రయత్నించినా కుదరలేదు. అయితే రక్షిత్ శెట్టిని మాత్రం రష్మికతో ఎందుకు విడిపోయారన్న ప్రశ్న వెంటాడుతూనే ఉంది.
ఈమధ్య సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులో రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ భారీ ప్రమోషన్స్ చేశాడు రక్షిత్ శెట్టి. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా రష్మికతో విడిపోయిన విషయం గురించి అడిగారు. ఇక రీసెంట్ గా రష్మికతో విడిపోయిన దాని మీద స్పందించాడు రక్షిత్ శెట్టి. అయితే రీజన్ చెప్పలేదు కానీ అవును మా పెళ్లి ఆగింది.. ఐతే ఏంటి ఇప్పటికీ మేమిద్దరం టచ్ లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద కల ఉంది. ఇప్పుడు దాన్ని నెరవేర్చుకుందని అన్నాడు.
రక్షిత్ ప్రపోజ్ చేయడం రష్మిక ఒప్పుకుని పెళ్లికి రెడీ అవ్వడం జరిగినా ఆ తర్వాత హీరోయిన్ గా తను చేయాల్సిన సినిమాలు.. ఊహించుకున్న జీవితం గురించే రష్మిక రక్షిత్ ని కాదనుకుందని చెప్పొచ్చు. అయితే ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరిద్దరు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి తోనే తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక మీదట అతను కూడా తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నాడని తెలుస్తుంది. రక్షిత్ శెట్టి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈతరం కథనాయకుల్లో ఎలాంటి పాత్రనైనా చేయగల ప్రతిభ ఉన్న నటుడు రక్షిత్ శెట్టి. సప్త సాగరాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అంతకుముందు 777 చార్లీ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన రక్షిత్ శెట్టి ఆ సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాడు.