ఆవిడెవరు? సానియా మిర్జాకు విడాకులిచ్చి మరీ పెళ్లాడాడు!
25 మార్చి 1993న సౌదీ అరేబియా జెడ్డాలో జన్మించిన జావేద్ 2012లో మహీరా ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆధ్యాత్మిక శృంగార డ్రామా సీరియల్ 'షెహర్-ఎ-జాత్'లో నటించింది.
భారత మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నుంచి షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చాలా కాలంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం తమ బంధం బ్రేక్ అయిందని నిర్ధారిస్తూ సానియా మిర్జా సోషల్ మీడియాల్లో గుంబన(క్రిప్టిక్)గా చేసిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ జంట విడిపోయిందంటూ అంతా మాట్లాడుకున్నారు. ఇంతలోనే పాకిస్థాన్ క్రికెటర్, సానియా మాజీ భర్త షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. మాలిక్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను అతడు సోషల్ మీడియాల్లో షేర్ చేసాడు. 'అల్హమ్దులిల్లాహ్' మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము అనే పదాలతో కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ ప్రకటన తర్వాత పాకిస్థానీ నటి సనా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను షోయబ్ మాలిక్ కు అప్డేట్ చేసింది.
మాలిక్ ని పెళ్లాడిన సనా జావేద్ ఎవరు? అంటూ ఇప్పుడు అంతటా ఆరాలు మొదలయ్యాయి. 25 మార్చి 1993న సౌదీ అరేబియా జెడ్డాలో జన్మించిన జావేద్ 2012లో మహీరా ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఆధ్యాత్మిక శృంగార డ్రామా సీరియల్ 'షెహర్-ఎ-జాత్'లో నటించింది. అదే సంవత్సరం మరో టీవీ సీరియల్ 'మేరా పెహ్లా ప్యార్'లో నటించింది. 2013లో ఐదు సీరియల్స్ ఒక టెలిఫిల్మ్‌లో కనిపించింది.
అప్పటి నుండి, సనా పాకిస్తానీ టెలివిజన్ పరిశ్రమలో పాపులర్ నటిగా కొనసాగుతోంది. జరా యాద్ కర్ సహా పలు ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ అంజుమ్ షాజాద్ డ్రామా సిరీస్ 'ఖానీ'లో 'ఖానీ' (సనమ్ అలీ ఖాన్) పాత్ర పోషించడంతో గొప్ప ప్రశంసలను పొందింది. లక్స్ స్టైల్ అవార్డ్స్ 2019లో రెండు నామినేషన్లను సంపాదించింది.
రుబీనా అష్రఫ్ క్రైమ్ డ్రామా 'రుస్వాయి'లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన సమీరా పాత్రలోను సనా నటించగా గొప్ప ప్రశంసలు అందుకుంది. ఆమె నటన 1వ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ స్క్రీన్ అవార్డ్స్ 2020లో ఉత్తమ టెలివిజన్ నటి (విమర్శకుల ఎంపిక) పురస్కారం దక్కించుకుంది. ARY పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021లో నంద్ పాత్రలో 'ప్రజల ఇష్టమైన నటి' పురస్కారాన్ని దక్కించుకుంది. 2020లో ఆమె జీతో పాకిస్థాన్ లీగ్‌లో ఇస్లామాబాద్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. రంజాన్ ప్రత్యేక రియాలిటీ షో ఇది.
మార్చి 2023లో, మాలిక్ తన 30వ పుట్టినరోజున నటి సనా జావేద్ ఫోటోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ''హ్యాపీ బర్త్‌డే బడ్డీ @sanajaved.official" అని రాశాడు. ఇప్పుడు అతడు సనా జావేద్ ని పెళ్లాడిన సంగతిని సోషల్ మీడియాల్లోనే రివీల్ చేసాడు.
ఇటీవల తన భర్త షోయబ్ మాలిక్ నుండి విడిపోయారనే పుకార్ల నడుమ సానియా మీర్జా తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల గురించి గుప్తమైన కోట్( క్రిప్టిక్) షేర్ చేసారు. ఈ సందేశం పూర్తి సారాంశం ఇలా ఉంది. ''వివాహం కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. ఊబకాయం కష్టం. ఫిట్‌గా ఉండటం కష్టం. మీ హార్డ్ ఏమిటో ఎంచుకోండి. అప్పులు చేయడం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. కమ్యూనికేషన్ కష్టం. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టం. మీ హార్డ్ ఎంచుకోండి. జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి'' అని రాసింది.
విడాకుల పుకార్లు చాలా కాలంగా ఉన్నా కానీ, సానియా- సోయబ్ చాలా కాలంగా బయటకు రానివ్వలేదు. షోయబ్ ని ఇదే విషయమై ప్రశ్నిస్తే వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జొరబాటు సరికాదని వారించాడు. తాను - సానియా విడిపోవడాన్ని ప్రైవేట్ విషయంగా ఉంచాలనకున్నామని, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని భావించినట్టు చెప్పారు. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ 2010లో హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన విలాసవంతమైన పెళ్లితో ఒకటయ్యారు. అక్టోబర్ 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. ఈ జంట చాలా కాలంగా UAE లో నివశిస్తున్నారు. మాలిక్ మొదట అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడు. సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నటి సనా జావేద్ ను మూడవ వివాహం చేసుకున్నాడు.