న‌టాషా మ‌ళ్లీ కెరీర్ పై దృష్టి పెడుతుందా?

హార్దిక్ తో అధికారికంగా విడిపోయిన అనంత‌రం కుమారుడిని తీసుకుని వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-06 06:13 GMT

న‌టాషా స్టాంకోవిచ్ ఇప్పుడు ప్రీబ‌ర్డ్. హార్దిక్ పాండ్య‌తో వివాహ జీవితానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇద్ద‌రు విడా కుల‌తో వేరైన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా న‌టాషా ఆవివాదంలో ఎంతో న‌లిగిపోయింది. హార్దిక్ తో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలా? లేదా? అన్నఅంశంపై ఎంతో ఆలోచించి నిల‌వ‌ని బంధంతో సావాసం అన్న‌ది అన‌వ‌స‌రంగా భావించి విడాకుల‌తో వేరైంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు త‌న స్వ‌దేశంలో ఉంటుంది.


హార్దిక్ తో అధికారికంగా విడిపోయిన అనంత‌రం కుమారుడిని తీసుకుని వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు తిరిగి కోలుకోవ‌డానికి కొందరికి సమ‌యం ప‌డుతుంది. మ‌న‌సుకు త‌గిలిన గాయం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి స‌మ‌యం తీసుకుంటారు. కానీ న‌టాషా మాత్రం అలాంటి ఫీలింగ్ ని ఎక్క‌డా ఫోక‌స్ చేయ‌కుండా అప్పుడే ప‌నిపై దృష్టి మ‌ళ్లించింది.


తాజాగా అమ్మడు ఇన్ స్టాలో ఓ కొత్త ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ ఔట్ ఫిట్ లో త‌ళుకులీనింది. అమ్మ‌డు స్కిన్ షోని హైలైట్ చేస్తూ కెమెరాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజు లిచ్చింది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌టాషా అందానికి నెటి జ‌న‌లు ఫిదా అవుతున్నారు. ఓ బిడ్డ‌కు త‌ల్లైనా న‌టాషా బ్యూటీలో మాత్రం ఇసుమెత్తు కూడా మార్పు రాలేదు.

అదే బ్యూటీని మెయింటెన్ చేస్తోంది. కానీ సినిమాలు చేసి మాత్రం ఐదేళ్లు అవుతుంది. 2019 నుంచి అమ్మ‌డు వెండి తెర‌కు దూరంగానే ఉంది. అప్ప‌టివ‌ర‌కూ సినిమాలు, వెబ్ సిరీస్ లు , మ్యూజిక్ వీడియోలు చేసింది. కానీ హార్దిక్ తో ల‌వ్ లో ప‌డిన త‌ర్వాత వాట‌న్నింటికి దూర‌మైంది. మ‌రి విడాకుల నేప‌థ్యంలో అమ్మ‌డు మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News