క్లాసిక్ సీక్వెల్.. 30 ఏళ్ల గ్యాప్‌ని ఎలా మ్యానేజ్ చేస్తారు?
ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు, గౌరవం అందుకుంది.
బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ లో క్లాసిక్ హిట్ మూవీ `అందాజ్ అప్నా అప్నా` సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు, గౌరవం అందుకుంది. పాత్రల పరంగా హాస్యం.. నటీనటుల అద్భుత ప్రదర్శనలతో రక్తి కట్టించిన ఈ సినిమాకి సీక్వెల్ రావాలని అభిమానులు చాలా కాలంగా ఆరాటపడుతున్నారు.
కానీ మూప్పై ఏళ్లుగా ఇది సాధ్యం కాలేదు. ఇందులో ప్రధాన నటులు సల్మాన్ - అమీర్ ఖాన్ కలిసి తిరిగి నటించేందుకు వీల్లేకుండా పోయింది. `అందాజ్ అప్నా అప్నా 2`లో ఇప్పుడు ఎవరు కనిపిస్తారు? అన్నది సస్పెన్స్ గానే ఉంది. నిజానికి పాత ముఖాల స్థానంలో రణవీర్ సింగ్ - రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ దీనిపై స్పష్ఠత లేదు.
ఒకవేళ మొదటి భాగంలో నటించిన అమీర్ -సల్మాన్ సీక్వెల్ కోసం తిరిగి వస్తారా? వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తారు? అనే చర్చ సాగుతోంది. మరి దాదాపు 30 ఏళ్ల గ్యాప్ ఎలా మ్యానేజ్ చేస్తారు? మొదటి చిత్రం లోని అమర్, ప్రేమ్ ఇప్పటికి చాలా పెద్దవారై ఉంటారు. వారి పాత్రలను ఎలా మార్చితే ప్రజలు అంగీకరిస్తారు? అన్నది విజయానికి కీలకం. సల్మాన్- అమీర్ లాంటి దిగ్గజ హీరోలు కలిసి నటిస్తే చూడాలని అభిమానులకు ఉంది. కానీ అది కుదరడం లేదు. కనీసం ఇప్పుడు ఒక క్లాసిక్ కోసం అయినా కలిసి పని చేస్తారా? వేచి చూడాలి.