సంక్రాంతి రిలీజ్.. ఆ సినిమా తప్పుకుంటుందా?

సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్స్ కొరతతో పాటూ పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో రావడం కష్టం.

Update: 2023-12-25 18:29 GMT

2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సీఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', 'తేజ సజ్జా 'హనుమాన్', విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్', రవితేజ 'ఈగల్', నాగార్జున 'నా సామిరంగా' సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. సంక్రాంతికి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉండడంతో థియేటర్స్ కొరతతో పాటూ పెద్ద సినిమాలకు ఓపెనింగ్స్ కూడా అనుకున్నంత స్థాయిలో రావడం కష్టం.

ఈ క్రమంలోనే ఇటీవలే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల నిర్మాతలతో చాంబర్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరుకారం, హనుమాన్‌ మధ్యనే ఎక్కువ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు జనవరి 12న విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాలు పోటీపడితే.. ఓపెనింగ్స్‌ దక్కవు. సూపర్‌స్టార్‌ మూవీ ఎన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజైతే అంత బెనిఫిట్‌. మరోవైపు టీజర్‌, ట్రైలర్‌ తో హనుమాన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

దాంతో మూవీ టీం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని జనవరి 12న విడుదల చేయాలని పట్టుబడ్డారు. గుంటూరుకారంతో పోటీపడితే.. హనుమాన్‌కు ఎక్కువ థియేటర్స్ దొరకవని టాక్. హనుమాన్‌తో పోటీ పడాల్సి వస్తే.. గుంటూరుకారం భారీ ఓపెనింగ్స్‌ మిస్‌ అవుతుంది. కాబట్టి ఏదో ఒక సినిమా ఒకరోజు ముందు జరిగితే బాగుంటుందని ఈ క్రమంలోనే ఒకరోజు ముందుకు లేదా వెనక్కి వెళ్లాలని హనుమాన్ మేకర్స్ కు సలహాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి మాక్సిమం థియేటర్ కేటాయించాలని నిర్మాతలు ట్రై చేస్తున్నారు. అందుకే హనుమాన్ రిలీజ్ డేట్ ని ఒకరోజు ముందుకు లేదా వెనక్కు మార్చుకోవాలని చెప్పగా ఆల్రెడీ హిందీలో జనవరి 12నే హనుమాన్ రిలీజ్ ను ఫిక్స్ చేసుకోవడంతో మేకర్స్ ఈ విషయంలో పట్టు విడవడంలేదట.

హనుమాన్ సినిమాని హిందీలో ఏకంగా 1500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. కాబట్టి మళ్లీ రిలీజ్ డేట్ మారిస్తే తమకు ఇబ్బంది అవుతుందని హనుమాన్ టీం మహేష్ వంటి స్టార్ హీరోతో పోటీ ఉన్నా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరి చివరికి ఈ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారనేది చూడాలి.

Tags:    

Similar News