యశ్ కొత్త సినిమా.. మళ్లీ అలాంటి కథతోనే

అయితే తాజాగా ఈ సినిమా బ్యాక్​ డ్రాప్​ ఇదేనంటూ కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. మళ్లీ యశ్​ సెమీ పిరియాడికల్ ఫిల్మ్​తో రానున్నారట.

Update: 2023-09-25 07:56 GMT

'కేజీయఫ్‌' సిరీస్‌ చిత్రాలతో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్. దీంతో ఆయన తదుపరి చిత్రం కోసం ఇండియా వైడ్​ ఆడియెన్స్​, ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన రెండు నేషనల్​ అవార్డ్​ ముద్దాడిన 'లయర్స్‌ డైస్‌'(హిందీ) ఫేమ్‌, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో యశ్‌ సినిమా చేయనున్నారంటూ కొద్ది రోజుల కింద కథనాలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమా బ్యాక్​ డ్రాప్​ ఇదేనంటూ కొత్త వార్తలు తెరపైకి వచ్చాయి. మళ్లీ యశ్​ సెమీ పిరియాడికల్ ఫిల్మ్​తో రానున్నారట. 1900లో గోవా మాఫియా కథాంశంతో సినిమా కథ నడుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే యశ్​ నటించిన కేజీయఫ్​ గ్యాంగ్ స్టర్​ నేపథ్యంలో తెరకెక్కినదే.

మరి ఈ తాజా వార్తలో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ నిజమైతే యశ్​ మాఫియా లీడర్​గా కనిపిస్తారా లేదా వారిని ఎదిరించే వ్యక్తిగా కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్‌ స్క్రిప్ట్​ వర్క్​పై పూర్తి ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే అంతా సెట్​ అయ్యాక అధికార ప్రకటన ఇస్తారని ప్రచారం సాగుతోంది.

కాగా,కొచ్చికి చెందిన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ అసలు పేరు గాయత్రీ దాస్‌. చైల్డ్ యాక్టర్​గా 'ఒన్ను ముత్తై పూజాయిమ్‌ వరే' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మొదటి ప్రయత్నంలోనే బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకుంది. తర్వాత మలయాళ, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్‌గా మెరిసింది. బెస్ట్‌ యాక్ట్రెస్ అవార్డును కూడా అందుకుంది.

2009లో కెల్కున్నుందో అనే మలయాళ షార్ట్‌ఫిల్మ్‌తో దర్శకురాలిగా మారిన ఆమె.. 2014లో లయర్స్‌ డైస్‌ తెరకెక్కించి రెండు జాతీయ అవార్డులతో పాటు స్పెషల్‌ జ్యూరీ విభాగంలో సోఫీయా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును గెలుచుకుంది. 2019లో మూథన్‌ చిత్రాన్ని తెరకెక్కించి సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2016లో ఓ గ్లోబల్‌ ఫిల్మ్‌మేకింగ్‌ అవార్డును కూడా ముద్దాడింది.

Tags:    

Similar News