యంగ్ హీరో తెలుగు హీరోయిన్ల‌కు ఛాన్స్ ఇవ్వ‌డా?

ఒక తెలుగు న‌టి స‌క్స‌స్ అయింద‌న్న మాట త‌ప్ప‌! ఇప్ప‌టివ‌ర‌కూ ఆమెకి కొత్త అవ‌కాశాలు వ‌చ్చిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Update: 2023-11-21 12:30 GMT

తెలుగు హీరోయిన్లకు ఛాన్సులివ్వండిన వేదిక‌ల‌పై కొంత మంది హీరోలు గ‌ట్టిగానే చెబుతున్నారు. సినిమాల‌పై ఆస‌క్తితో వ‌స్తోన్న అలాంటి వారిని ప్రోత్స‌హిస్తే మ‌రింత మంది తెలుగు హీరోయిన్లు వ‌స్తార‌ని...ఇత‌ర భాష‌ల నుంచి దిగుమ‌తి చేసుకునే అవ‌స‌రం ఉండ‌ద‌ని..ఆర్దికంగానూ బ‌ల‌ప‌డ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఎన్నిర‌కాల హింట్లు ఇచ్చినా? తెలుగు హీరోయిన్ల‌ను ప్రోత్స‌హించేది ఎంత మంది అంటే? స‌రైన స‌మాధానం దొర‌క‌డం క‌ష్టం.

ఒక తెలుగు న‌టి స‌క్స‌స్ అయింద‌న్న మాట త‌ప్ప‌! ఇప్ప‌టివ‌ర‌కూ ఆమెకి కొత్త అవ‌కాశాలు వ‌చ్చిన దాఖ‌లాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు తెలుగు అమ్మాయిలు మౌల్డ్ అవుతామ‌న్నా? కూడా అవ‌కాశాలివ్వ‌ని స‌న్నివేశం క‌నిపిస్తుంది. తాజాగా ఓ యంగ్ హీరో కూడా మ‌రోసారి త‌న ప‌ర‌భాషా ప్రీతిని చాటుకున్నాడు. ఎలాంటి బ్యాకప్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చిన ఆ హీరో స‌క్స‌స్ అవ్వ‌డానికి చాలా కాలం ప‌ట్టింది.

చివ‌రికి ఎలాగూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఐడెంటిటీని చాటుకున్నాడు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నమైన సినిమాల‌తో ఆ యంగ్ హీరోకిప్పుడు మంచి గుర్తింపు ఉంది. ఇక ఆ హీరో సినిమా చేస్తున్నాడంటే? కెమెరా బిహైండ్ కూడా అతనే కీల‌క పాత్ర‌ధారి. ఎందుకంటే ఆ యంగ్ హీరో కూడా ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది కాబ‌ట్టి. అత‌ను ట్యాలెంటెడ్ రైట‌ర్ అన‌డం లో సందేహం లేదు. అలా అన్ని విష‌యాల్లో అత‌ను భాగ‌స్వామ్యం అవుతున్నాడు. కానీ తెలుగు హీరోయిన్లు తీసుకోవాలి? అన్న అంశం వ‌చ్చే స‌రికి స్కిప్ కొడుతున్నట్లే క‌నిపిస్తుంది.

త‌న సినిమా సీక్వెల్స్ అన్నింటిలోనూ ఇత‌ర భాష‌ల నాయిక‌ల్ని..ముఖ్యంగా ముంబై మోడ‌ల్స్ ని తీసుకున్నాడు త‌ప్ప‌! ఇంత‌వ‌ర‌కూ ఏ తెలుగు న‌టికి అవ‌కాశం క‌ల్పించ‌లేదు. ఓ న‌టికి అవకాశం క‌ల్పించినా అమె ముంబై నుంచి దిగిమ‌తి అయిన భామే. ఇటీవ‌లే మ‌రో సీక్వెల్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కి స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులోనైనా తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇస్తాడు? అన‌కుంటే? అక్క‌డా నిరాశే ఎదురైంది. త‌న క‌థ‌కి కేవ‌లం హిందీ హీరోయిన్లే స‌రితూగుతార‌ని మ‌రోసారి నిరూపించాడు.

Tags:    

Similar News